వారిని ఎదుర్కోవడం అంత సులభం కాదు.. అవకాశాలన్ని వారివే.. సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్..

బాలీవుడ్ ఇండస్ట్రీ పై హీరోయిన్ రిచాచద్దా సంచలన కామెంట్స్ చేసింది. ఆ ఇండస్ట్రీలో ఔట్ సైడర్స్ పై వివక్ష ఎక్కువగా కనిపిస్తుందని తెలిపింది. ఇక

  • Rajitha Chanti
  • Publish Date - 9:15 am, Thu, 28 January 21
వారిని ఎదుర్కోవడం అంత సులభం కాదు.. అవకాశాలన్ని వారివే.. సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్..

బాలీవుడ్ ఇండస్ట్రీ పై హీరోయిన్ రిచాచద్దా సంచలన కామెంట్స్ చేసింది. ఆ ఇండస్ట్రీలో ఔట్ సైడర్స్ పై వివక్ష ఎక్కువగా కనిపిస్తుందని తెలిపింది. ఇక ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక.. పెద్ద నటీనటుల వారసులను ఎదుర్కొంటూ ఇండస్ట్రీలో రాణించడం సులభం కాదని తెలిపింది. సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గురించి కీలక వ్యాఖ్యలు చేసింది రిచాచద్ధా.

“ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నేను ఎన్నో అవమానాలను ఎదుర్కోన్నా. సినిమాలో అవకాశం వచ్చిందని సంతోషపడేలోపు ఆ అవకాశం చేజారిపోయేది. ఒక సినిమా కోసం నన్ను సెలక్ట్ చేసి.. ఆ తర్వాత వేరేవారిని తీసుకునేవారు. సెట్‏లోకి వెళ్ళిన చివరి నిమిషంలో నా స్థానంలోకి వేరే అమ్మాయిగా హీరోయిన్‏గా తీసుకునేవారు. ఇక వారసత్వంలో వచ్చిన నాయికలు రికమండేషన్స్ ద్వారా నాకు వచ్చిన అవకాశాలన్నింటిని లాక్కున్నాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో వారసులు, స్టార్స్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ఆ వారసులను ఎదురించి పోరాడాలంటే చాలా కష్టం. దీంతో సినిమాలపై ఆశలు వదిలేసుకున్నాను. తర్వాత మెల్లగా వెబ్ సిరీస్‏లలో నటించాలనుకున్నాను. మొదట్లో చాలా మంది ఈ వెబ్ సిరీస్ చేయడం వలన ఉపయోగం లేదని చెప్పేవారు. కానీ ఇప్పుడు అవే సిరీస్ నాలో ఉన్న నటన ప్రతిభను గుర్తించేలా చేశాయి. ప్రతిభ ఉంటే వారసత్వంతో పనిలేదు. కాకపోతే అనుకున్నా లక్ష్యాన్ని చేరుకోవడానికి కాస్తా సమయం పడుతుంది. అప్పటివరకు ఓపికగా ఎదురు చూడాలి” అంటూ చెప్పుకొచ్చింది రిచాచద్దా.

Also Read:

అదరగొడుతున్న విజయ్ ‘మాస్టర్’.. ఏకంగా 240 దేశాల్లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ.. డేట్ ఫిక్స్..