Gang Leader Brothers: 30 ఏళ్ల తర్వాత కలిసిన రఘుపతి.. రాఘవ.. రాజా రామ్‌ల ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్

మెగాస్టార్ చిరంజీవి చిన్న చిన్న పాత్రలతో పాటు విలన్‌గా నటిస్తూ హీరోగా మారి ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్ లో 20 దశాబ్దాలకు పైగా నెంబర్ 1 సింహాసనాన్ని చక్రవర్తిలా ఏలారు. అయితే ఆయన సినీ కెరీర్‌లో గ్యాంగ్ లీడర్ సినిమాకు...

Gang Leader Brothers: 30 ఏళ్ల  తర్వాత కలిసిన రఘుపతి.. రాఘవ.. రాజా రామ్‌ల ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్

Updated on: Jan 25, 2021 | 11:50 AM

Gang Leader Brothers:  మెగాస్టార్ చిరంజీవి చిన్న చిన్న పాత్రలతో పాటు విలన్‌గా నటిస్తూ హీరోగా మారి ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్ లో 20 దశాబ్దాలు పాటు నెంబర్ 1 సింహాసనాన్ని చక్రవర్తిలా ఏలారు. అయితే ఆయన సినీ కెరీర్‌లో గ్యాంగ్ లీడర్ సినిమాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ సినిమాలో చిరు మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్, విజయశాంతి కెమిస్ట్రీ, అన్నదమ్ముల అనుబంధం, నిర్మలమ్మ నటన ఎప్పటికీ మరచిపోలేము. ఇక బప్పీలహరి సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలు ఓ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్నాయి.

విజయ బాపినీడు దర్శకత్వంలో, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఈ సినిమా 1991 లో మే న రిలీజై ఈ ఏడాది మే 9 కి 30 ఏళ్ళు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గ్యాంగ్ లీడర్ లో మురళీ మోహన్, శరత్ కుమార్, చిరంజీవి లు రఘుపతి.. రాఘవ.. రాజారామ్‌లుగా అన్నదమ్ములుగా నటించారు. తాజాగా మురళీ మోహన్, శరత్ కుమార్ లు తమ తమ్ముడైన చిరు ని కలిశారు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో తమ్ముడి కోసం అన్నలిద్దరూ వెళ్లి ఆ సెట్ మీద కలిశారు. ప్రస్తుతం ముగ్గురు ఉన్న పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘గ్యాంగ్ లీడర్’ మూవీలో ఫొటోతో పాటు తాజాగా చిరుతో మురళీ మోహన్, శరత్ కుమార్ తీసుకున్న ఫొటో కూడా జతచేసి #30YERSFORGANGLEADER అనే హ్యాష్ ట్యాగ్‌తో మరో మూడు నెలల్లో ‘గ్యాంగ్ లీడర్’ 30 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని చెప్పారు. ఈ ఫోటో మెగా అభిమానులను అలరిస్తుంది.

Also Read: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ అధికారులు.. భారీగా సర్వదర్శనం టోకెన్ల పెంపు