Good News to Devotees: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ అధికారులు.. భారీగా సర్వదర్శనం టోకెన్ల పెంపు

కరోనా వైరస్ మానవుల జీవన గమనంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజలు గుంపులుగా ఉండే ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో పుణ్యక్షేత్రాల్లోని దైవం కూడా..

Good News to Devotees: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ అధికారులు.. భారీగా సర్వదర్శనం టోకెన్ల పెంపు
Follow us

|

Updated on: Jan 25, 2021 | 10:53 AM

Good News to Devotees: కరోనా వైరస్ మానవుల జీవన గమనంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజలు గుంపులుగా ఉండే ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో పుణ్యక్షేత్రాల్లోని దైవం కూడా అర్చకులు నిర్వహించే పూజలు తప్ప.. భక్తులకు దర్శనం ఇవ్వలేదు. ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం నుంచి అన్ని సంస్థలు బయటపడుతున్నాయి. ఇక ప్రభుత్వ ఆదేశాలతో దేవాలయాలు కూడా తెరుచుకున్నాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ.. భక్తులు దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకుంటున్నారు.

ఇక కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల కరోనాకు ముందు భక్తులతో ఎప్పుడు రద్దీగా ఉండేది. అయితే కరోనా అనంతరం భక్తుల రద్దీ అంతగా ఉండడంలేదు.. రోజు వారీ టోకెన్ల ప్రకారమే శ్రీవారిని భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వెంకన్న భక్తులకు టీటీడీ పాలక మండలి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సర్వదర్శనం టోకెన్‌లను పదివేల నుంచి ఏకంగా 20వేలకు పెంచింది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు తిరుపతి రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉండే విష్ణు నివాసంతో పాటు భూదేవి కాంప్లెక్స్‌లో ఈ సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. టోకెన్లు తీసుకునే భక్తులు తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని టీటీడీ అధికారులు సూచించారు. తప్పని సరిగా మాస్క్లు ధరించాలని.. భౌతిక దూరం పాటిస్తూ చేతులను శానిటైజ్ చేసుకోవాలని అధికారులు చెప్పారు.

Also Read: ఇస్రో రికార్డ్ ను బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ ను సృష్టించిన స్పేస్‌ఎక్స్.. 143 శాటిలైట్లు లాంఛ్