Tollywood: హిట్ కోసం హిస్టరీని తవ్వే పనిలో పడ్డ హీరోలు.. ఇప్పుడంతా ఇదే ట్రెండ్‌.

హిట్ కొట్టాలంటే హిస్టారికల్ కథలు తప్ప మరో ఆప్షన్ లేదా..? ఈ డౌట్ ఎందుకొచ్చిందిప్పుడు అనుకోవచ్చు..? మరి రాదా చెప్పండి.. ఏదో ఒక్క హీరో అంటే ఏమో అనుకోవచ్చు.. అరే ప్రతి హీరో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ ఎంచుకుంటుంటే అనుమానాలు కాక ఇంకేం వస్తాయి చెప్పండి..? తాజాగా వరుణ్ తేజ్ కూడా అదే చేస్తున్నారు. అసలు హిట్ కోసం హిస్టరీ తవ్వుతున్న హీరోలెవరో చూద్దాం పదండి ఓసారి..

Tollywood: హిట్ కోసం హిస్టరీని తవ్వే పనిలో పడ్డ హీరోలు.. ఇప్పుడంతా ఇదే ట్రెండ్‌.
Periodic Movies
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Narender Vaitla

Updated on: Jul 29, 2023 | 3:00 AM

హిట్ కొట్టాలంటే హిస్టారికల్ కథలు తప్ప మరో ఆప్షన్ లేదా..? ఈ డౌట్ ఎందుకొచ్చిందిప్పుడు అనుకోవచ్చు..? మరి రాదా చెప్పండి.. ఏదో ఒక్క హీరో అంటే ఏమో అనుకోవచ్చు.. అరే ప్రతి హీరో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ ఎంచుకుంటుంటే అనుమానాలు కాక ఇంకేం వస్తాయి చెప్పండి..? తాజాగా వరుణ్ తేజ్ కూడా అదే చేస్తున్నారు. అసలు హిట్ కోసం హిస్టరీ తవ్వుతున్న హీరోలెవరో చూద్దాం పదండి ఓసారి..

ఈ మధ్య ఏ హీరోను తీసుకున్నా కూడా చరిత్రను తవ్వండి అంటున్నారు. కనీసం 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్లకుండా దర్శకులు కూడా కథలు రాయలేకపోతున్నారు. ఏ హీరోను తీసుకున్నా ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తుంది. పైగా హిస్టారికల్ సినిమాలకు సక్సెస్ పర్సెంటేజ్ ఉంది. ఈ మధ్య వచ్చిన సార్, ఉప్పెన, ట్రిపుల్ ఆర్, రంగస్థలం, పుష్ప ఇవన్నీ ఇప్పటి సినిమాలు కావు.. అన్నీ పాతికేళ్ల నుంచి 50 ఏళ్ల నాటి కథలే.

తాజాగా వరుణ్ తేజ్, కరుణ కుమార్ కాంబినేషన్‌లో మట్కా సినిమా ఓపెన్ అయింది. వైరా ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 1970 నేపథ్యంలో వస్తుంది. టైటిల్‌లోనే చాలా హింట్స్ ఇచ్చారు దర్శకుడు కరుణ కుమార్. 1975 నాటి రూపాయి కాయిన్.. 5 రూపాయల నోట్లు.. పాత కారు.. వెనక నోట్ల కట్టలు.. ఇవన్నీ చూస్తుంటే ఇదేదో మాఫియా కథ అని అర్థమవుతుంది. వైజాగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

వరుణ్ ఒక్కరే కాదు.. రామ్ చరణ్ సైతం వరసగా పీరియాడిక్ సినిమాల వైపు అడుగులేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ 1920స్ బ్యాక్‌డ్రాప్‌లో రాగా.. శంకర్, బుచ్చిబాబు సినిమాల్లో 1940స్ నేపథ్యం ఉంది. అలాగే బాలయ్య, బాబీ సినిమాతో పాటు.. పవన్ కళ్యాణ్ ఓజి 1980స్ నేపథ్యంలోనే వస్తున్నాయి. పుష్ప 2 గురించి చెప్పనక్కర్లేదు. ఇలా టాలీవుడ్ అంతా ఇప్పుడు పీరియాడిక్ ట్రెండ్ నడుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..