AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja : మరో సారి మాస్ రాజా సినిమా గురించి టాక్.. రవితేజ కోసం అదిరిపోయే కథను సిద్ధంచేస్తున్న దర్శకుడు

మాస్ మహారాజ రవితేజ చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత సాలిడ్ హిట్ లేక సతమతమయ్యాడు రవితేజ. వరుసగా సినిమాలు చేయనప్పటికీ అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి

Ravi Teja : మరో సారి మాస్ రాజా సినిమా గురించి టాక్.. రవితేజ కోసం అదిరిపోయే కథను సిద్ధంచేస్తున్న దర్శకుడు
Raviteja
Rajeev Rayala
|

Updated on: Apr 07, 2021 | 7:35 AM

Share

Ravi Teja : మాస్ మహారాజ రవితేజ చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత సాలిడ్ హిట్ లేక సతమతమయ్యాడు రవితేజ. వరుసగా సినిమాలు చేయనప్పటికీ అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. మధ్యలో అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా లాంటి విభిన్నమైన కథలు చేసినప్పటికీ అవికూడా నిరాశపరిచాయి. అయితే 2021లో ప్రారంభంలో క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో మాస్ రాజా రవితేజ తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు.

ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వం సినిమా చేస్తున్నాడు. ఖిలాడి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఆతర్వాత త్రినాద్ నక్కిన డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ రెండు  సినిమాల తర్వాత రవితేజ ఎవరితో సినిమా చేస్తున్నదన్నదానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే చాలా కాలం నుంచి డైరెక్టర్ మారుతితో రవితేజ సినిమా ఉండనుందని టాక్ నడుస్తుంది. సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజు పండగే సినిమాతో హిట్ అందుకున్న మారుతి ప్రస్తుతం మ్యాచో హీరో గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడు. ఏ ఈసినిమా తర్వాత రవితేజ తో సినిమా ఉంటుందని ఎప్పటినుంచో టాక్ నడుస్తుంది. అయితే ఇప్పుడు మారుతి రవితేజ కోసం ఓ అద్భుతమైన కథను తయారు చేసే పనిలో ఉన్నాడట. రవితేజ కోసం మాస్ ఎంటర్టైనర్ తోపాటు కామెడీ ఎలిమెంట్స్ ఉండే కథను సిద్ధం చేస్తున్నాడని టాక్. మరి ఈ ఇద్దరి కాంబో లో వచ్చే సినిమా పై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

పోలీస్‌ డ్రెస్‌లో అతడిని చూసి జెలసీ ఫీలవుతున్నా..! సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటున్న వెటరన్‌ హీరో..

ఆ రోజే మా ఎంగేజ్‌మెంట్..! ఆహ్వాన పత్రిక కూడా రెడీ..? అసలు విషయాన్ని వెల్లడించిన గ్లామర్‌ బ్యూటీ..

మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైన రామ్ గోపాల్ వర్మ.. సీనియర్ హీరోతో కలిసి వస్తున్న ‘ఆర్జీవి దెయ్యం’..