AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Kishan: దేశ సేవకు కదిలిన ‘రేసు గుర్రం’ విలన్ కూతురు..అగ్నివీర్‌గా రవికిషన్ గారాల పట్టి.. ప్రముఖుల ప్రశంసలు

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన రేసుగుర్రం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో బన్నీ కి ఎంత పేరొచ్చిందో ఇందులో విలన్ గా నటించిన భోజ్ పురి నటుడు రవి కిషన్ కు అంతే మంచి గుర్తింపు వచ్చింది.

Ravi Kishan: దేశ సేవకు కదిలిన 'రేసు గుర్రం' విలన్ కూతురు..అగ్నివీర్‌గా రవికిషన్ గారాల పట్టి.. ప్రముఖుల ప్రశంసలు
Ravi Kishan Daughter
Basha Shek
|

Updated on: Aug 11, 2026 | 7:59 PM

Share

భోజ్ పురి సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా వెలుగొందుతున్నారు రవి కిషన్. అలాగే ప్రస్తుతం పార్లమెంట్ సభ్యునిగానూ సేవలు అందిస్తున్నారీ నటుడు. తెలుగులోనూ రవికిషన్ కు మంచి గుర్తింపు ఉంది. అల్లు అర్జున్ రేసు గుర్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారాయన. కిక్ 2, రాధే, సుప్రీమ్, ఎమ్మెల్యే, లై, సాక్ష్యం, ఎన్టీఆర్ కథానాయాకుడు, 90 ఎంఎల్, డాకూ మహరాజ్, రీసెంట్ గా రామ్ చరణ్ ‘పెద్ది’లోనూ ఓ కీలక పాత్రలో నటించారు రవి కిషన్. సినిమాల సంగతి పక్కన పెడితే రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు రవి కిషన్. 2019 సాధారణ ఎన్నికల్లో గోరఖ్ పూర్ ఎంపీగా ఘన విజయం సాధించి పార్లమెంట్ లోకి అడుగు పెట్టారీ నటుడు. ఇక 2024 జనరల్ ఎలక్షన్స్ లో నూ భారీ మెజారిటీతో మళ్లీ గెలుపొందారాయన. ఇలా ఓ వైపు సినిమాలు చేస్తూన మరోవైపు పార్లమెంట్ సభ్యునిగా ప్రజలకు సేవ చేస్తున్నారీ ట్యాలెంటెడ్ యాక్టర్.

కాగా రవి కిషన్ భార్య పేరు ప్రీతిశుక్లా. 1993లో వీరి వివాహం జరిగింది. వీరికి మొత్తం నలుగురు సంతానం. ఒకరు కుమారుడు కాగా మరో ముగ్గురు కూతుర్లు. అయితే ఇందులో ఒక కూతురు ఇషితా శుక్లా సినిమా ఇండస్ట్రీని కాదని విభిన్నమైన కెరీర్‌ ఎంచుకుంది. తండ్రిలా కాకుండా మరో డిఫరెంట్‌ కెరీర్‌ను ఎంచుకుంది. చిన్నప్పటి నుంచే ‍ఆర్మీలో పని చేయాలని కలలు కన్న ఇషితా స్కూల్ అండ్ కాలేజ్ డేస్ లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ)లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది. ఈ క్రమంలోనే 2023లోనే ఇషితా అగ్నివీర్‌గా చేరినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే సైనిక శిక్షణ పొందిన ఈ స్టార్ కిడ్ ఢిల్లీ డైరెక్టరేట్‌కు చెందిన 7 గర్ల్స్ బెటాలియన్‌లో పనిచేసింది. అలాగే కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవ పరేడ్ లోనూ పాల్గొంది.

ఇవి కూడా చదవండి

ఇషితా శుక్లా ఫొటోస్..

దేశానికి సేవ చేయడమేనంటూ ముందుకు సాగుతోన్న ఇషితా నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ అలాగే హీరో మాధవన్ కూడా కూడా ఇషితాను ప్రస్తావిస్తూ తెగ మెచ్చుకున్నారు. దీంతో రవికిషన్ కూతురు పేరు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ మార్మోగుతుంది.

View this post on Instagram

A post shared by Ravi Kishan (@ravikishann)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..