కీర్తి సినిమాకు రష్మిక రివ్యూ
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రం ఇటీవల ఆన్‌లైన్‌లో విడుదలైన విషయం తెలిసిందే. కార్తీక్ ఈశ్వర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మిక్స్‌డ్ రివ్యూలు వినిపించాయి.

జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రం ఇటీవల ఆన్‌లైన్‌లో విడుదలైన విషయం తెలిసిందే. కార్తీక్ ఈశ్వర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మిక్స్‌డ్ రివ్యూలు వినిపించాయి. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ క్లైమాక్స్‌ను ఇంకాస్త బాగా తీసి ఉండాల్సింది అంటూ కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక ఈ మూవీపై పలువురు సెలబ్రిటీలు కూడా తమ రివ్యూను ఇవ్వగా.. తాజాగా పెంగ్విన్‌పై నటి రష్మిక మందన తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
”పెంగ్విన్ చూశా. కీర్తి నీ నటన ఎప్పటిలాగే అద్భుతం. సినిమాలో కుటుంబాన్ని కాపాడే సైరస్ పాత్ర చాలా బావుంది. బిడ్డలను కాపాడుకునే తల్లులందరికీ ఇది కచ్చితంగా నచ్చుతుంది. కార్తీక్ ఈశ్వర్, కార్తీక్ సుబ్బరాజ్ ఇద్దరికి కంగ్రాట్స్. పెంగ్విన్ టీమ్ అందరికీ అభినందనలు” అని రష్మిక ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. మరి రష్మిక రివ్యూపై కీర్తి ఎలా స్పందిస్తుందో చూడాలి.
Read This Story Also: ఔరంగాబాద్ పారిశ్రామికవేత్తతో కాజల్ పెళ్లి..!
https://www.instagram.com/p/CBvN0fOpgvF/?utm_source=ig_embed



