ఔరంగాబాద్ పారిశ్రామికవేత్తతో కాజల్ పెళ్లి..!

టాలీవుడ్ చందమామ కాజల్ పెళ్లి వార్త మరోసారి చక్కర్లు కొడుతోంది. ఔరంగాబాద్‌కి చెందిన ఓ పారిశ్రామికవేత్తను కాజల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇప్పుడో వార్త తెగ వైరల్ అవుతోంది

ఔరంగాబాద్ పారిశ్రామికవేత్తతో కాజల్ పెళ్లి..!
Follow us

| Edited By:

Updated on: Jun 23, 2020 | 10:44 AM

టాలీవుడ్ చందమామ కాజల్ పెళ్లి వార్త మరోసారి ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఔరంగాబాద్‌కి చెందిన ఓ పారిశ్రామికవేత్తను కాజల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇప్పుడో వార్త తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరి వివాహానికి సంబంధించి ఇరు వర్గాల కుటుంబసభ్యులు మాట్లాడుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు కూడా సమాచారం. మరి ఈ వార్తలపై కాజల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

కాగా ఆ మధ్యన లక్ష్మీ మంచుతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్.. తన పెళ్లిపై మాట్లాడింది. ఎలాంటి వాడు కావాలి అన్న లక్ష్మి ప్రశ్నకు.. బాగా చూసుకునేవాడు, ఆధ్యాత్మిక భావాలు కలిగిన వాడు తనకు కావాలని కాజల్ చెప్పిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే కాజల్ ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. తెలుగులో చిరంజీవి ‘ఆచార్య’, మంచు విష్ణు ‘మోసగాళ్లు’ చిత్రాల్లో నటిస్తుండగా.. తమిళంలో ‘ఇండియన్ 2’, ‘హే సినామికా’లో కనిపించనుంది. అలాగే హిందీలో ‘ముంబయి సగ’లో కాజల్ నటిస్తోంది. వీటితో పాటు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తోన్న ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సిరీస్‌లోనూ చందమామ నటిస్తోంది. వీటితో పాటు పలు మరిన్ని ప్రాజెక్ట్‌లు ఆమె చేతిలో ఉన్నట్లు సమాచారం.

Read This Story Also: మరోసారి క్లారిటీ ఇచ్చిన పునర్నవి