టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో తెలిస్తే..
టైటానిక్.. 112 ఏళ్లు గడుస్తున్నా ఈ ఓడ మునిగిపోయి.. ఇంటర్నెట్‌లో దీని గురించి ఏ అంశం వచ్చినా.. ఇప్పటికీ అదొక సెన్సేషనే. 1912 ఏప్రిల్ 15న అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ ఓడ మునిగిపోగా.. ఈ ప్రమాదంలో దాదాపుగా 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఓడ ప్రమాదం..
టైటానిక్.. 112 ఏళ్లు గడుస్తున్నా ఈ ఓడ మునిగిపోయి.. ఇంటర్నెట్‌లో దీని గురించి ఏ అంశం వచ్చినా.. ఇప్పటికీ అదొక సెన్సేషనే. 1912 ఏప్రిల్ 15న అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ ఓడ మునిగిపోగా.. ఈ ప్రమాదంలో దాదాపుగా 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఓడ ప్రమాదం జరిగిన ముందు రోజు రాత్రి అందులోని ప్రయాణీకులు అందరూ ఏం తిన్నారో తెల్సా.? అదేంటి.! ప్రమాదం అంశం గురించి మాట్లాడుతూ ఈ వెటకారపు ప్రశ్న ఏంటని ఆలోచిస్తున్నారా.?
అదేం లేదండీ.. తాజాగా టైటానిక్ షిప్‌కి సంబంధించి మెనూ కార్డు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మెనూ కార్డులో టైటానిక్ షిప్‌లో ఫస్ట్, థర్డ్ క్లాస్‌లో ప్రయాణించిన ప్రయాణీకుల కోసం తయారు చేసిన ఆహార పదార్ధాల లిస్టు ఉంది. ఇక ఈ మెనూను చాలా ఏళ్ల క్రితం బ్రిటన్‌లో వేలం వేస్తే ఏకంగా రూ. 84 లక్షలు పలికిందట. సరే.! ఇంతకీ ఆ మెనూ కార్డులో ఏమున్నాయంటే.? మొదటి తరగతిలో ప్రయాణించే ప్రయాణీకుల కోసం చికెన్, కార్న్డ్ బీఫ్, కూరగాయలు, పకోడాలు, గ్రిల్డ్ మటన్, హామ్ పై, సాసేజ్ చీజ్, పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు సిద్దం చేశారట. అలాగే మూడో తరగతి ప్రయాణీకుల కోసం గంజి, పాలు, బంగాళదుంపలు, హామ్, గుడ్లు, బ్రెడ్, వెన్న, జామ్, టీ, కాఫీ లాంటి వాటిని ప్రిపేర్ చేసినట్టులో అందులో ఉంది. కాగా, ఈ మెనూ కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తించడమే కాదు.. లైక్ బటన్‌పై వరుసపెట్టి క్లికులు కొట్టేస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ దానిపై ఓ లుక్కేయండి.
Titanic 1st class menu vs 3rd class menu from April 14, 1912, the day before the Titanic sank. pic.twitter.com/RBDbfqfm2I
— Fascinating (@fasc1nate) April 3, 2024