మరో బాలీవుడ్ సినిమాను ఓకే చేసిన రష్మిక మందన.. ఏకంగా అమితాబచ్చన్ సినిమాలో ఛాన్స్..?
టాలీవుడ్ లో అడుగుపెట్టిన అతితక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది కన్నడ భామ రష్మిక. యంగ్ హీరో నాగశౌర్య నటించిన ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత..

టాలీవుడ్ లో అడుగుపెట్టిన అతితక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది కన్నడ భామ రష్మిక. యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో కనిసి ‘గీతగోవిందం’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఆతర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ దక్కించుకుంది. ఈ ఏడాది మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతోపాటు యంగ్ హీరో నితిన్ నటించిన ‘భీష్మ’ మూవీతో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ఈ అమ్మడు తమిళంలోనూ సినిమా చేస్తున్న కార్తీ నటిస్తున్న ‘సుల్తాన్’ సినిమాలో రష్మిక నటిస్తుంది. అదే విధంగా బాలీవుడ్ లోను అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటుంది ఈ చిన్నది. చేతినిండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక. మరో బాలీవుడ్ సినిమాకి ఓకే చేసినట్లు సమాచారం. ఇటీవలే సిద్దార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’ అనే సినిమా చేస్తుంది రష్మిక. తాజాగా అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ఓ సినిమాలో ఎమ్మడుని హీరోయిన్ గా ఎంపిక చేసారని ప్రచారం జరుగుతుంది. డైరెక్టర్ వికాస్ బల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం రష్మిక సైన్ చేసిందని అంటున్నారు. ‘డెడ్లీ’ అనే పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమా కథ ఒక తండ్రి – కూతురు మధ్య జరుగుతుందని సమాచారం. ఈ మూవీని 2021 మర్చి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.




