AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయబోతున్న యంగ్ హీరో.. ’18 పేజెస్’ సినిమాలో నిఖిల్ అలా కనిపించబోతున్నాడట..

యంగ్ హీరో నిఖిల్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తన కెరియర్ లో మంచి విజయాన్ని సొంతచేసుకున్న 'కార్తీకేయ' సినిమా సీక్వెల్ 'కార్తికేయ 2'..

తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయబోతున్న యంగ్ హీరో.. '18 పేజెస్' సినిమాలో నిఖిల్ అలా కనిపించబోతున్నాడట..
Rajeev Rayala
|

Updated on: Dec 27, 2020 | 4:40 PM

Share

యంగ్ హీరో నిఖిల్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తన కెరియర్ లో మంచి విజయాన్ని సొంతచేసుకున్న ‘కార్తీకేయ’ సినిమా సీక్వెల్ ‘కార్తికేయ 2′ ను చేస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీతో పాటు ’18 పేజెస్’ అనే సినిమా చేస్తున్నాడు. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఈ సినిమాలోఅనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సుకుమార్ విలక్షణమైన పాత్రలను సృష్టిస్తున్నాడట. నిఖిల్ కోసం అలంటి పాత్రనే సృష్టించాడట సుకుమార్. ఈ సినిమాలో నిఖిల్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాతో కెరియర్ లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు నిఖిల్. అందులో ఒకపాత్ర గతం మరిచిపోయే నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా చేయబోతున్నాడట నిఖిల్. సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణదాస్ కె నారంగ్ మరియు పుష్కర్ రామ్ ఎమ్ రావ్ తో కలసి చేయబోతున్నఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ త్వరలోనే వస్తుందని అంటున్నారు.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి