గీత మేడం‌కు ఏమైంది..? ప్లీజ్ కమ్ బ్యాక్ రష్మిక..!

ఇండస్ట్రీకి వచ్చిన అనతికాలంలో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సంపాదించుకుంది రష్మిక మందన్న. ఈ ఏడాది 'సరిలేరు నీకెవ్వరు'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రష్మిక..

గీత మేడం‌కు ఏమైంది..? ప్లీజ్ కమ్ బ్యాక్ రష్మిక..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 16, 2020 | 12:58 PM

ఇండస్ట్రీకి వచ్చిన అనతికాలంలో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సంపాదించుకుంది రష్మిక మందన్న. ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రష్మిక.. ఇప్పుడు అల్లు అర్జున్ 20వ చిత్రంలో నటించేందుకు సిద్దమవుతోంది. అలాగే ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్న చిత్రంలో ఓ హీరోయిన్‌గా రష్మిక ఫైనల్ అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వీటితో పాటు కోలీవుడ్‌లోనూ పలు సినిమాలతో బిజీగా ఉంది ఈ కన్నడ బ్యూటీ. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఉన్నట్లుండి దూరం అయిపోయింది.

ట్విట్టర్‌లో మార్చి 6న మిలియన్ ఫాలోవర్లకు థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేసి.. మార్చి 7న వెంకీ కుడుముల ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన రష్మిక.. ఆ తరువాత ఎలాంటి ఫొటోలు గానీ ట్వీట్ గానీ పెట్టలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. అసలు రష్మికకు ఏమైందంటూ వర్రీ అవుతున్నారు. రష్మిక ట్విట్టర్ ఫాస్‌వర్డ్ మర్చిపోయిందేమో అని బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘‘కమ్ బ్యాక్ రష్మిక.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం.. మీ నవ్వును మిస్ అవుతున్నాం. మీ సెల్ఫీని మిస్ అవుతన్నాం’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో #ComeBackRashmika అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. Read This Story Also: కరోనా వ్యాక్సిన్ రెడీ.. నేడే తొలి క్లినికల్ ట్రయల్..!