‘బ్రహ్మాస్త్ర’ వీడియో లీక్.. రణ్‌బీర్, అలియా అదరగొట్టేశారు

రణ్‌బీర్ కపూర్, అలియా భట్ నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున అతిథి పాత్రలో మెరవనున్నారు. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతోన్న ఈ మూవీని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వారణాసిలో శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రీకరణలో భాగంగా రణ్‌బీర్, అలియాలపై ఓ పాటను తెరకెక్కించారు. దానికి సంబంధించిన కొన్ని […]

'బ్రహ్మాస్త్ర' వీడియో లీక్.. రణ్‌బీర్, అలియా అదరగొట్టేశారు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 17, 2019 | 9:54 PM

రణ్‌బీర్ కపూర్, అలియా భట్ నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున అతిథి పాత్రలో మెరవనున్నారు. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతోన్న ఈ మూవీని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వారణాసిలో శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రీకరణలో భాగంగా రణ్‌బీర్, అలియాలపై ఓ పాటను తెరకెక్కించారు. దానికి సంబంధించిన కొన్ని వీడియాలో సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇక ఆ వీడియోలో రణ్‌వీర్, అలియా అదరగొట్టేశారు. ఇదిలా ఉంటే అక్కడ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న బ్రహ్మాస్త్ర టీమ్ మళ్లీ ముంబై బయలుదేరి వెళ్లింది. అయితే గతేడాది ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. ఈ నెలలో విడుదల చేయాలని మొదట దర్శకనిర్మాతలు ప్రకటించారు. కానీ షూటింగ్‌లో జాప్యం వల్ల ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడింది. క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

https://www.instagram.com/p/B6KDUiNBTBn/?utm_source=ig_embed

https://www.instagram.com/p/B6IzTjahR9T/?utm_source=ig_embed