
Rana Daggubati: రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం విరాట పర్వం (Virata Parvam). నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన వేణు ఊడుగుల దర్శకత్వం వహించడం, రానా, సాయి పల్లవిలు నటిస్తుండడంతో సినిమాపై అందరిపై బజ్ ఏర్పడడానికి కారణంగా మారింది. జూన్ 17న ప్రేక్షకులకు ముందకు రానున్న నేపథ్యంలో చిత్రం యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచే పనిలో పడింది. ఇందులో భాగంగానే తాజాగా హీరో రానా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో పలు విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ‘మీకు పాన్ ఇండియా రీచ్ వుంది కదా .. విరాటపర్వం పాన్ ఇండియా ప్లాన్ చేయకపోవడానికి కారణం?’ అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన రానా.. ఇప్పుడంతా పాన్ ఇండియా అంటున్నారు కానీ నేను పదేళ్లుగా ఆ పాన్ లోనే ఆమ్లెట్లు వేసుకుంటున్నాను అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. ఇక విరాట పర్వాన్ని పాన్ ఇండియగా ఎందుకు విడుదల చేయలేదన్న దానికి బదులిస్తూ.. ‘కొన్ని కథలు తెలుగులోనే చేయాలి. విరాట పర్వం మొదలు పెట్టినప్పుడే మాకు పాన్ ఇండియా ఆలోచన లేదు. ఇది ఒక ప్రాంతానికి సంబధించిన కథ.
ఆ ప్రాంతం తాలూకు సాహిత్యం ఎక్కువగా వుంది. దర్శకుడు వేణు ఉడుగుల స్వతహాగా సాహిత్యకారుడు. ఈ సాహిత్యం మరో భాషలో కుదరక పోవచ్చు. అందుకే పాన్ ఇండియా ఆలోచన పెట్టుకోలేదు. అయితే ఈ సినిమాను మలయాళం, బెంగాళీ, హిందీలో డబ్ చేస్తున్నామ’ని చెప్పుకొచ్చారు రానా. ఇక సీరియస్ టోన్‌లో ఉన్న విరాట పర్వం కథకు ప్రేక్షకులకు కనెన్ట్ అవుతారాన్న అన్న ప్రశ్నకు.. ‘ఈ సినిమా చూసి చప్పట్లు కొడతారో లేదో తెలియదు కానీ .. ఇది నిజమే కదా అని మాత్రం భయపడతారు. అంత నిజాయితీ గల కథ ఇది’ అని చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..