ఆ బయోపిక్‌లో రానా నటించడం లేదట
రానాకు సంబంధించి ఇటీవల ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొట్టింది. దివంగత నటుడు శోభన్‌బాబు జీవితకథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతుందని,
Rana Daggubati News: రానాకు సంబంధించి ఇటీవల ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొట్టింది. దివంగత నటుడు శోభన్‌బాబు జీవితకథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతుందని, అందులో రానా, శోభన్ బాబు పాత్రలో నటించనున్నాడని కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. అయితే రానా సన్నిహితులు వాటిని ఖండించారు. రానా సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం రానా, శోభన్ బాబు బయోపిక్‌కి ఓకే చెప్పలేదట. శోభన్ బాబు పాత్రకు రానా సెట్ అవ్వడని వారు చెప్పినట్లు సమాచారం.
కాగా ప్రస్తుతం రానా, వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వంలో నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రియమణి, నందితాదాస్, జరీనా ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతో పాటు రానా నటించిన హాథీ మేరీ సాధీ (తెలుగులో అరణ్య) విడుదలకు సిద్ధంగా ఉంది.
Read More: