‘షేమ్ ఆన్ విజయ్ సేతుపతి’.. హోరెత్తుతున్న ట్వీట్లు
కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి వివాదాలకు కాస్త దూరంగా ఉంటారు. సినిమా పరంగా ఎలాంటి పాత్రల్లో నటించినా.. బయట మాత్రం చాలా క్రమశిక్షణతో ఉంటారు ఈ నటుడు
Shame on Vijay Sethupathi: కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి వివాదాలకు కాస్త దూరంగా ఉంటారు. సినిమా పరంగా ఎలాంటి పాత్రల్లో నటించినా.. బయట మాత్రం చాలా క్రమశిక్షణతో ఉంటారు ఈ నటుడు. అయితే ఇప్పుడు ఈ హీరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పేరు మీద ట్విట్టర్‌లో ట్వీట్లు హోరెత్తుతున్నాయి. షేమ్ ఆన్ విజయ్ సేతుపతి అంటూ కొంతమంది తమ అసహనాన్ని బయటపెడుతున్నారు. అయితే అసలు విషయంలోకి వెళ్తే..
శ్రీలంక క్రికెట్ దిగ్గజం, స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. అందులో ముత్తయ్య మురళీధరన్‌గా విజయ్ సేతుపతి నటించనున్నారు. దీనికి సంబంధించి టైటిల్ మోషన్ పోస్టర్‌తో పాటు విజయ్ సేతుపతి లుక్ కూడా విడుదలైంది. 800తో తెరకెక్కబోతున్న ఈ మూవీలో విజయ్ లుక్ అదిరిపోయింది. ఈ పాత్ర కోసం శారీరంగా చాలా కష్టపడ్డారు విజయ్. ఇక ఈ మూవీలో ముత్తయ్య జీవితంలో కనిపించని అనేక కోణాలు తెరపైకి వస్తాయని మూవీ మేకర్లు తెలిపారు.
అయితే ఈ మూవీని ప్రకటించిన తరువాత కొంతమంది నెటిజన్లు విజయ్ సేతుపతిపై, సినీ మేకర్లపై నెట్టింట నిరసన వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంక ప్రభుత్వం కొన్నేళ్లుగా ఆ దేశంలో తమిళులను అణిచి వేస్తుందని, అలాంటి దేశానికి చెందిన ఓ మాజీ క్రికెటర్ పాత్రలో తమిళనాడుకు చెందిన విజయ్ సేతుపతి కనిపించడం ఆశ్చర్యంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇండియన్ అయ్యి ఉండి శ్రీలంక జాతీయ జెండా ఉన్న జెర్సీని ధరిస్తున్నాడంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో షేమ్ ఆన్ విజయ్ సేతుపతి, తమిల్స్ బాయ్‌కాట్ విజయ్ సేతుపతి అంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరేమో నటుడిగా విజయ్ సేతుపతి తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు, ఒక అమెరికన్ వచ్చి గాంధీ సినిమాను తీసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు అంటూ నటుడికి మద్దతు ఇస్తున్నారు.
కాగా మురళీధరన్ పూర్వీకుల మూలాలు తమిళనాడులో ఉన్నాయి. ఆయన శ్రీలంకకు చెందిన తమిళుడు. ఇక శ్రీలంకలో 1977 లో తమిళులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలోనూ బాధితుడు. అంతేకాదు మురళీధరన్‌కి ఇండియన్ సిటిజన్‌షిప్ కూడా ఉన్న విషయం తెలిసిందే.
Read More: