భారీ వర్షాలు.. నెహ్రూ జూపార్క్ మూసివేత

హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌ని మళ్లీ మూసేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ నెహ్రూ జూపార్క్‌ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

భారీ వర్షాలు.. నెహ్రూ జూపార్క్ మూసివేత
Follow us

| Edited By:

Updated on: Oct 14, 2020 | 11:33 AM

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌ని మళ్లీ మూసేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ నెహ్రూ జూపార్క్‌ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో జూలో వర్షం నీరు నిలిచిపోయింది. సఫారీ పార్క్‌, బియర్ మోట్‌, మైదాన్ ఎన్‌క్లోజ్‌ తదితర ప్రాంతాల్లో నీరు నిలిచింది. కాగా కరోనా లాక్‌డౌన్‌ తరువాత ఈ నెల 6న నెహ్రూ జూపార్క్‌ తెరుచుకుంది. వారం రోజుల తరువాత భారీ వర్షాలతో మళ్లీ జూను క్లోజ్‌ చేశారు.

ఇదిలా ఉంటే మరోవైపు తెలంగాణలో భారీ కుండపోత కురుస్తుండగా.. హైదరాబాద్‌ శివారు ప్రాంతాలు, చిగురుటాకులా వణికిపోతున్నాయి. నగరంలోని పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకోగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధులు, కాలనీల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కొన్ని చోట్ల ఇళ్లు, బ్రిడ్జిలు, గోడలు కూలిపోయి ప్రాణనష్టం కూడా సంభవించింది. ఈ క్రమంలో బోట్ల సాయంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మరికొన్ని ప్రదేశాల్లో విద్యుత్‌ తీగలు తెగిపడటంతో.. ఇళ్లలో కరెంట్ కూడా లేదు. మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరిస్తున్నారు.

Read More:

సమయం ఆసన్నమైంది.. ప్రతి ఇంట్లో ఒక్క రైతు అయినా పుట్టాలి: పూరీ

ప్రముఖ నృత్యకారిణి శోభా నాయుడు కన్నుమూత