సినిమా ఆఫర్లను సున్నితంగా తిరస్కరించిన శోభానాయుడు
శోభానాయుడు.. కూచిపూడి నృత్యకళను శోభాయమానం చేసిన గొప్ప కళాకారిణి.. నాట్యమే వేదంగా, జీవననాదంగా మలచుకున్న ధన్యజీవి.. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే!
శోభానాయుడు.. కూచిపూడి నృత్యకళను శోభాయమానం చేసిన గొప్ప కళాకారిణి.. నాట్యమే వేదంగా, జీవననాదంగా మలచుకున్న ధన్యజీవి.. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే! ఆమె నర్తనకు మువ్వలు సైతం మురిసిపోతాయి..ఆమెకు బోలెడన్ని సినిమా అవకాశాలు వచ్చినా నాట్యం మీద మక్కువతో వాటన్నింటినీ వదిలేసుకున్నారు.. అంజలీదేవి, ఆదినారాయణరావులు 1976లో మహాకవి క్షేత్రయ్య సినిమా నిర్మించతలపెట్టారు. అందులో కూచిపూడి నాట్యాలున్న ఓ పాత్రకు శోభానాయుడుని అడిగారు.. ఆమె సున్నితంగా తిరస్కరించారు.. సినిమాలకు తాను దూరమంటూ వినయంగా చెప్పారు.. అప్పుడా పాత్రను మంజుల వేశారు..