AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమయం ఆసన్నమైంది.. ప్రతి ఇంట్లో ఒక్క రైతు అయినా పుట్టాలి: పూరీ

పూరీ మ్యూజింగ్స్ పేరుతో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన అభిప్రాయాలను వెల్లడిస్తోన్న విషయం తెలిసిందే.

సమయం ఆసన్నమైంది.. ప్రతి ఇంట్లో ఒక్క రైతు అయినా పుట్టాలి: పూరీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 14, 2020 | 11:29 AM

Share

Puri vertical Farming: పూరీ మ్యూజింగ్స్ పేరుతో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన అభిప్రాయాలను వెల్లడిస్తోన్న విషయం తెలిసిందే. జీవితాలను ఎనలైజ్‌ చేసి ఆయన చెబుతున్న అభిప్రాయాలను పూరీ అభిమానులనే కాదు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా తన మ్యూజింగ్స్‌లో రైతుల గురించి, వర్టికల్ ఫార్మింగ్ గురించి పూరీ మాట్లాడారు.

వర్టికల్ ఫార్మింగ్‌లో వివిధ పద్దతులను ఉపయోగించి మన కూరగాయాలను మనమే పండించుకోవచ్చు. మట్టి అవసరం లేకుండా కూడా పంటలు పండిచ్చొచ్చు. మీ టెర్రస్ మీద పార్కింగ్ స్థల్లాలో తక్కువ నీటితో ఎలాంటి రసాయనాలు లేకుండా కూరగాయలు పండించుకోవచ్చు. వర్టికల్ ఫార్మింగ్‌ గురించి ఎన్నో కంపెనీలు అవగాహన కలిగిస్తున్నాయి. వాటిని చూసి నేర్చుకోవాలి అని పూరీ తెలిపారు.

వ్యవసాయ భూమి మరో 70శాతం పెరగకపోతే మనకు భవిష్యత్‌లో తినడానికి కూడా తిండి ఉండదు. ప్రస్తుతం జనాభా పెరుగుతున్న తీరును చూస్తుంటే రానున్న 20 ఏళ్లలో జనాభా 10 మిలియన్లు పెరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. మన భవిష్యత్‌ తరాలు బతికేందుకు కనీసం బిడ్డకు ఒక ఎకరం అయినా మనం కలిగి ఉండాలి. అమెరికా, చైనా దేశాలతో పోలిస్తే భారత్‌లో వ్యవసాయానికి అనువయ్యే భూమి చాలా ఉంది. కానీ ఇది మనకు సరిపోదు. మనమందరం రైతులుగా మారాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఒక్క రైతు అయినా పుట్టాలి అని ఈ దర్శకుడు వెల్లడించారు.

అంతేకాదు కొన్ని కారణాల వలన రైతులు వర్టికల్ ఫార్మింగ్‌ని చేయలేకపోతున్నారు. కానీ ఇప్పటినుంచైనా ప్రతి గ్రామంలో వర్టికల్ ఫార్మింగ్‌పై అవగాహన కలిగించాలి. ఈ విషయంలో ప్రభుత్వం ముందడుగు వేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొనకపోతే రానున్న 20 ఏళ్లలో తినడానికి మనకేం ఉండదు అని తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. నిజంగా పూరీ చెప్పినవి అక్షర సత్యాలు. ఇప్పటికే దేశంలో తిండి దొరక్క చాలా మంది చనిపోతున్నారని సర్వేలు సైతం చెబుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వాలు, ప్రజలు మేల్కొవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read More:

ప్రముఖ నృత్యకారిణి శోభా నాయుడు కన్నుమూత

22 ఏళ్ల తరువాత కలిసి నటించనున్న ‘జీన్స్’ జంట..!