ప్రముఖ నృత్యకారిణి శోభా నాయుడు కన్నుమూత
ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి శోభా నాయుడు ఇక లేరు. ఆర్థో న్యూరాలజీ సమస్యలతో పాటు కరోనా సోకడంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
Shobha Naidu passes away: ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి శోభా నాయుడు ఇక లేరు. ఆర్థో న్యూరాలజీ సమస్యలతో పాటు కరోనా సోకడంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడించారు. కాగా 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించిన శోభా నాయుడు.. 12 ఏళ్ల వయసులో కూచిపూడిలో అరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరిన శోభా నాయుడు, వెంపటి నృత్య రూపాలలో అన్ని పాత్రలను పోషించారు. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో రాణించిన శోభా నాయుడుకు భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. హైదరాబాద్ కూచిపూడి ఆర్ట్ అకాడమీకి ఆమె ప్రిన్సిపల్‌గా పనిచేశారు. 1982లో నిత్య చూడామణి, 1991లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1998లో ఎన్టీఆర్ పురస్కారాలను అందుకున్నారు. ఇక యూకే, సిరియా, టర్కీ, హాంకాంగ్, మెక్సికో, వెనిజులా, క్యూబా సహా పలు దేశాల్లో ఆమె ప్రదర్శనలు ఇచ్చారు.
Read More:
22 ఏళ్ల తరువాత కలిసి నటించనున్న ‘జీన్స్’ జంట..!