Breaking News
  • అమరావతి: సివిల్‌ సప్లైస్‌ డోర్‌ డెలివరీ వాహనాలకు రివర్స్‌ టెండరింగ్. ప్రభుత్వానికి సుమారు రూ.63 కోట్లు ఆదా. రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాల కొనుగోలు. గవర్నమెంట్‌ ఈ మార్కెట్‌ ప్లేస్‌ పోర్టల్‌లో రివర్స్‌ టెండరింగ్‌. టాటా మోటార్స్‌కు దక్కిన టెండర్‌. ఒక్కో వాహనంపై రూ.67 వేలు ఆదా.
  • విజయవాడ: తేజస్విని మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించిన పోలీసులు. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు. భారీగా పోలీసుల మోహరింపు.
  • తెలంగాణ వ్యాప్తంగా వరదల వల్ల 50 మంది మృతి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 11 మంది మృతి. 7.35 లక్షల ఎకరాల్లో పంట నీటమునిగింది. రాష్ట్రంలో పంట నష్టం రూ.2 వేల కోట్లు-సీఎం కేసీఆర్‌. హైదరాబాద్‌లో 2,540 ఇళ్లు నీటిలో చిక్కుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 101 చెరువు కట్టలు తెగాయి. ముంపు నిబంధనలు పాటిస్తేనే ఇకపై అపార్ట్‌మెంట్లకు పర్మిషన్‌. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లకు జరిగిన నష్టం రూ.490 కోట్లు-సీఎం కేసీఆర్‌.
  • వెదర్ రిపోర్ట్: తెలంగాణాలో రాగల మూడు రోజులు వర్షాలు. దక్షిణ మధ్య మహారాష్ట్ర, కొంకన్ ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపో స్పియర్ స్థాయి వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. తదుపరి ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి మహారాష్ట్ర తీరము దగ్గరలో అరేబియా సముద్రం లోకి ప్రవేశిస్తుంది. రాగల 48 గంటల్లో మహారాష్ట్ర ఆనుకుని ఉన్న తూర్పు, ఈశాన్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా బలపడి.. క్రమేపీ పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి మరింత బలపడే అవకాశం. ఉపరితల ఆవర్తనం వరకు1.5 కి.మీ నుండి 3.1 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతున్న ఉపరితల ద్రోణి. మధ్య బంగాళాఖాతంలో సుమారు అక్టోబర్ 19వ తేదీన మరో అల్పపీడనం. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు.
  • చెన్నై విమానాశ్రయంలో బంగారం పట్టివేత. రూ.40 లక్షల విలువైన 765 గ్రాముల బంగారం పట్టివేత. దుబాయ్‌ నుంచి చెన్నై వచ్చిన ప్రయాణికుడి నుంచి స్వాధీనం. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు.
  • తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. నవధాన్యాలతో అంకురార్పణ నిర్వహించిన అర్చకులు. రేపటి నుండి ఏకాంతంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ఆలయంలో ఏకాంతంగా వాహనసేవలు. రేపు రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేషవాహనసేవ.
  • ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ మహిళ భాను అతయ్య (91) మృతి. ముంబై లోని స్వగృహం లో తుది శ్వాస విడిచిన భాను. కాస్ట్యూమ్స్ డిజైనర్ గా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న భాను. 1982 లో రిలీజ్ అయిన గాంధీ సినిమా కు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పని చేసిన భాను. ఆ సినిమా కు ఆస్కార్ అందుకున్న భాను.

మరో అవతారం ఎత్తబోతున్న రజనీకాంత్‌..!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ మరో అవతారం ఎత్తబోతున్నారా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి కోలీవుడ్‌లో

Rajini Annatthe movie, మరో అవతారం ఎత్తబోతున్న రజనీకాంత్‌..!

Rajini Annatthe movie: సూపర్‌స్టార్‌ రజనీకాంత్ మరో అవతారం ఎత్తబోతున్నారా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి కోలీవుడ్‌లో. ప్రస్తుతం శివ దర్శకత్వంలో రజనీ అన్నాత్తే అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో రజనీ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఇక ఇందులో రజనీ గ్రామ సర్పంచ్‌గా కనిపించగనుండగా.. ఈ మూవీ కోసం సూపర్‌స్టార్ మరో నిర్ణయం తీసుకున్నారట.

అన్నాత్తేలో రజనీ పాత్రకు సంబంధించిన డైలాగ్‌లు అన్నీ ఆయనే రాసుకునేందుకు సిద్ధమయ్యారట. దీనిపై దర్శకుడు శివతో సంప్రదింపులు జరిపారని, అందుకు శివ ఒప్పుకున్నారని సమాచారం. అంతేకాదు తన డైలాగ్‌లు రాసే పనిలో కూడా రజనీ పడ్డట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. రజనీకాంత్‌లోని రైటర్‌ కోణం అభిమానులు ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా ఈ మూవీలో నయన్‌తార, మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, సూరి తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ విలన్‌గా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి డి.ఇమ్మన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,446 కొత్త కేసులు.. 8 మరణాలు

ఇవాళ పిల్లి సుభాష్ చంద్రబోస్ సతీమణి అంత్యక్రియలు

Related Tags