ఆకాశ్ పూరీ సినిమాకు వాయిస్ అందించనున్న ఇస్మార్ట్ శంకర్.. ఇందులో కీలక పాత్రలో నటించనున్న..

పూరీ జగన్నాధ్, యువ హీరో రామ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. చాలా రోజుల నుంచి

  • uppula Raju
  • Publish Date - 9:23 pm, Sat, 26 December 20
ఆకాశ్ పూరీ  సినిమాకు వాయిస్ అందించనున్న ఇస్మార్ట్ శంకర్.. ఇందులో కీలక పాత్రలో నటించనున్న..

పూరీ జగన్నాధ్, యువ హీరో రామ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. చాలా రోజుల నుంచి హిట్ లేక ఎదురుచూస్తున్న రామ్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. అందుకు హీరో రామ్ కూడా పూరీకి చాలా సార్లు ధన్యవాదాలు తెలిపాడు. కాగా ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా ప్రకటించారు కానీ ఇప్పటివరకు ఎటువంటి విషయాలు తెలుపలేదు.

తాజాగా పూరీ జగన్నాధ్ కుమారుడు ఆకాష్ పూరి- దిల్లీ బ్యూటీ కేతిక శర్మ నటిస్తున్న `రొమాంటిక్` లో రామ్ భాగమయ్యాడు. ఈ మూవీ కథను రామ్ తన గొంతు ద్వారా ఆడియెన్ కి వినిపిస్తాడని తెలిసింది. ఇందులో రామ్ నటిస్తాడని వార్తలు వచ్చినా అందులో ఏ మాత్రం నిజం లేదు. కానీ ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తోందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే దర్శకుడు పూరి జగన్నాధ్ ఫైటర్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్ దేవర కొండ హీరోగా కనిపించనున్నాడు. ఈ సినిమా తర్వాత ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌ను చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.