‘సలార్’ షూటింగ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచి చిత్రీకరణలో పాల్గొననున్న పాన్ ఇండియా స్టార్ ?..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన సాహో సినిమా మంచి విజయం సాధించిన తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన సాహో సినిమా మంచి విజయం సాధించిన తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాను తొందరగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం. జిల్ ఫేమ్ రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రముఖ యువీ క్రియేషన్స్, టీసిరీస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమా తర్వాత ప్రభాస్ మూడు సినిమాలలో నటించనున్నట్లుగా టాక్. ఇటీవల కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా తీయబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను తర్వలోనే ప్రారంభించబోతున్నారట. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి సలార్ షూటింగ్లో ప్రభాస్ పాల్గొనబోతున్నట్లుగా సమాచారం. కాగా ఈ మూవీ కోసం ప్రభాస్ కంటిన్యూగా 4 నెలల పాటు వర్క్ చేయబోతున్నాడట. సలార్ తర్వాత ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్.. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.