రామ్ కొత్త సినిమా కోసం ఆ మాస్ డైరెక్టర్ ? మళ్లీ యాక్షన్ వైపే అడుగులేస్తున్న యంగ్ హీరో..

గతేడాది విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో తనలోని కొత్త యాంగిల్‏ను భయటపెట్టాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. దాదాపు

  • Rajitha Chanti
  • Publish Date - 7:41 pm, Fri, 22 January 21
రామ్ కొత్త సినిమా కోసం ఆ మాస్ డైరెక్టర్ ? మళ్లీ యాక్షన్ వైపే అడుగులేస్తున్న యంగ్ హీరో..

Hero Ram: గతేడాది విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తనలోని కొత్త యాంగిల్‏ను భయటపెట్టాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. దాదాపు కెరిర్ మొదటి నుంచి అన్ని సాఫ్ట్ అండ్ లవర్ బాయ్ పాత్రలు చేసిన రామ్ పూరీ జగన్నాథ్‏తో కలిసి మాస్ యాంగిల్‏ను చూపించాడు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ‘రెడ్’ మూవీలో కూడా ఫుల్ మాస్ లుక్‏లో కనిపించాడు రామ్. ఇక సంక్రాంతి కానుకగా వచ్చిన రెడ్ సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతోంది. తాజాగా సమాచారం ప్రకారం రామ్ మరోసారి ఫుల్ బ్యాక్ మాస్ లుక్‏లో కనిపించబోతున్నాడట.

తమిళ దర్శకుడు ఆర్.టి.నెసన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లుగా సమాచారం. దర్శకుడు ఈ స్టోరీని వినిపించగా.. రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయని.. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రానున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మరీ ఈసారి కూడా రామ్ మాస్ లుక్‏లో భారీ హిట్ కొడతారా ? అనేది చూడాలి.

Also Read:

Director Prashanth Neel: ప్రభాస్ సినిమా పై వస్తున్న రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..