‘రంగ్ దే’ కంటే ముందే రానున్న నితిన్ ‘చెక్’.. విడుదల తేదీని ఖరారు చేసిన చిత్రయూనిట్..

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ 'భీష్మ' సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఈ ఏడాది వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే

  • Rajitha Chanti
  • Publish Date - 8:37 pm, Fri, 22 January 21
'రంగ్ దే' కంటే ముందే రానున్న నితిన్ 'చెక్'.. విడుదల తేదీని ఖరారు చేసిన చిత్రయూనిట్..

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ‘భీష్మ’ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఈ ఏడాది వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే నితిన్ నటిస్తున్న ‘రంగ్ దే’ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇందులో కిర్తీ సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అంతేకాకుండా త్వరలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నహాలు చేస్తుంది.

ఈ క్రమంలోనే నితిన్ నటిస్తోన్న మరో సినిమా ‘చెక్’ కూడా విడుదలకు సిద్దమవుతోంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చంద్రశేఖర్ ఏలేటీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. తాజాగా ఈ మూవీని ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఓ ఖైదీ కథగా జైలులో నేపథ్యంలో ఈ సినిమా రానుంది. ఉరిశిక్ష పడిన ఖైదీ తన లక్ష్యాన్ని చెస్ గేమ్ ద్వారా ఎలా నెరవేర్చుకున్నాడన్నదే కథ.

Also Read:

Lucky Key Movie Remake: కొరియన్ రీమేక్‏లో వెంకటేష్ ?.. క్రైమ్ ఎంటర్‏టైనర్‏గా రానున్న విక్టరీ..