Pushpa 2: పుష్ప2 ఇడ్లీలు అంటూ ఆర్జీవీ ట్వీట్.. టికెట్ రేట్స్ పై వర్మ స్టైల్ కామెంట్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచేశారు. దీని పై తాజాగా సంచలన దర్శకుడు ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్ చేశారు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఆయన పై పోలీసు కేసు కూడా నమోదు అయ్యింది. ఏపీలో ఎలక్షన్స్ సమయంలో వ్యహం అనే సినిమా తెరకెక్కించి దాన్ని ప్రమోట్ చేశారు ఆర్జీవీ. అయితే ఆ సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇదిలా ఉంటే ఆర్జీవీ అరెస్ట్ కు బయపడి పారిపోయారు అంటూ కొన్ని రూమర్స్ పుట్టుకొచ్చాయి. తాను ఎక్కడికి పారిపోలేదని ఓ వీడియో వదిలారు వర్మ. ఇదంతా పక్కన పెడితే ఆర్జీవీ చేసే ట్వీట్స్ వివాదాలకు దారిస్తున్నాయి. తాజాగా పుష్ప 2 టికెట్ ధరలు గురించి సెటైరికల్ గా ట్వీట్ చేశారు ఆర్జీవీ. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఇది కూడా చదవండి :Allu Arjun : పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న ట్వీట్
పుష్ప ఇడ్లీలు అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ” సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు.
ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! అస్సలు గుర్తుపట్టలేం గురూ..!! ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
“సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదు” అని ఎవరైనా ఏడిస్తే , అది “సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు” అని ఏడ్చినంత వెర్రితనం. ఒకవేళ “సెవెన్‌స్టార్ హోటల్లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం” అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాఏ.. డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతే కానీ ప్రజా సేవ కోసం కాదు”.
ఇది కూడా చదవండి :Nargis fakhri : మాజీ బాయ్ ఫ్రెండ్‌ను హత్య చేసిన స్టార్ హీరోయిన్ సోదరి.. అరెస్ట్ చేసిన పోలీసులు
“అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు ? ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా? ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా? అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ వున్నప్పుడు , ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. అలా అనుకొని వారు చూడటం మానెయ్యొచ్చూ , లేదా తర్వాత రేట్లు తగ్గక చూసుకోవచ్చు కదా? మళ్ళీ సుబ్బారావు హోటల్ చైన్ విషయం కొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది.. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బా రావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు, అన్ని సీట్లు బుక్ అయిపోయాయి!” అంటూ పుష్ప 2 టికెట్ ధరల గురించి ట్వీట్ చేశారు వర్మ.
పుష్ప 2 ఇడ్లీలు #Pushpa2
సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు.
కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు…
— Ram Gopal Varma (@RGVzoomin) December 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.