ఇప్పుడు కొత్తగా ఆలోచించాలంటూ.. జక్కన్నకు వర్మ ట్వీట్‌

కరోనా లాక్‌డౌన్‌ వేళ సినీ పరిశ్రమ మొత్తం ఇంటికే పరిమితం అయ్యింది. ఇక లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించినా.. కొన్ని సినిమాలు మాత్రమే సెట్స్ మీదకు వెళ్లాయి

ఇప్పుడు కొత్తగా ఆలోచించాలంటూ.. జక్కన్నకు వర్మ ట్వీట్‌
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2020 | 12:47 PM

కరోనా లాక్‌డౌన్‌ వేళ సినీ పరిశ్రమ మొత్తం ఇంటికే పరిమితం అయ్యింది. ఇక లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించినా.. కొన్ని సినిమాలు మాత్రమే సెట్స్ మీదకు వెళ్లాయి. అయితే అందరికి భిన్నంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దూసుకుపోతున్నారు. వరుసగా చిత్రాలను విడుదల చేస్తూ, కొత్త సినిమాలను ప్రకటిస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే క్లైమాక్స్‌, నేక్డ్‌, కరోనా వైరస్‌ చిత్రాలను ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. త్వరలో పవర్‌ స్టార్ చిత్రాన్ని ఆయన విడుదల చేయబోతున్నారు. ఇక ఈ చిత్ర ట్రైలర్ ఈ నెల 22న రిలీజ్‌ అవ్వబోతుంది. అయితే ఈ ట్రైలర్‌ని చూడాలంటే రూ.25లు చెల్లించాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే పవర్‌స్టార్ ట్రైలర్ రిలీజ్‌ విషయాన్ని చెప్తూ దర్శకధీరుడు రాజమౌళిని ఉద్దేశించి కొన్ని ట్వీట్లు చేశారు వర్మ. ”పవర్‌స్టార్‌ ట్రైలర్‌ కొని, చూసేందుకు చాలా మంది ఆసక్తిని చూపుతున్నారు. ఒకవేళ ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ని రాజమౌళి రూ.150, రూ.200 పెట్టి అమ్మినట్లైతే ఒక్క ట్రైలర్‌తోనే నిర్మాత పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది. అప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా సినిమాను చూడొచ్చు.

ట్రైలర్‌ను చూసి సినిమాను అమ్మడం పాత ఆలోచన. కానీ రాజమౌళి ట్రాక్ రికార్డును చూస్తే.. ఆయన మూవీ ట్రైలర్‌ని చూసేందుకే చాలా మంది ఎదురుచూస్తుంటారు. ఆయన ట్రైలర్ కూడా మూవీతో సమానం. రాజమౌళి 10 నిమిషాల షార్ట్‌ ఫిలిం తీసినా.. మల్టీఫ్లెక్స్ టికెట్‌ కొని మరీ దాన్ని చూస్తారు.

హే రాజమౌళి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం ఆన్‌లైన్‌ వైపు చూస్తోంది. ప్రస్తుత కాలంలో అదే మార్కెట్‌. కొత్తగా ఆలోచించు. ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ను డబ్బులు పెట్టి కొని చూసేందుకు ఎదురుచూస్తున్నాం” అని వర్మ ట్వీట్లు చేశారు.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు