చెర్రీ పాత్రలో మార్పులు చేస్తోన్న కొరటాల..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న 'ఆచార్య'లో రామ్‌ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.

చెర్రీ పాత్రలో మార్పులు చేస్తోన్న కొరటాల..!
Follow us

| Edited By:

Updated on: May 11, 2020 | 3:58 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య’లో రామ్‌ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇందులో చిరు, చెర్రీ గురు శిష్యుల పాత్రల్లో నటిస్తుండగా.. చెర్రీ దాదాపు 30 నిమిషాలకు పైగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో చెర్రీ పాత్ర కోసం కొరటాల కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇదివరకే ఈ పాత్ర కోసం డైలాగ్‌లు రాసి పెట్టుకున్నప్పటికీ.. ఇప్పుడు మారుస్తున్నట్లు తెలుస్తోంది.

కొన్ని సన్నివేశాలతో పాటు డైలాగ్‌లను కొరటాల మారుస్తున్నారట. సినిమా రిలీజ్ అయ్యాక చెర్రీ సన్నివేశాలు సెన్సేషన్‌ క్రియేట్ చేస్తాయని కొరటాల భావిస్తున్నారట. కొరటాల మాత్రమే కాదు ఈ లాక్‌డౌన్‌ సమయంలో పలువురు దర్శకులు తమ సినిమా స్క్రిప్ట్‌లను మార్చే పనిలో పడ్డారట. ఈ లిస్ట్‌లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్‌ తదితరులు ఉన్నారు. సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పుడు మార్పులు చేయడం కంటే.. ఇప్పుడే చేయడం వలన సమయం కలిసొచ్చే అవకాశం ఉందని వారు అనుకుంటున్నారట. కాగా కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ఈ నెల 17తో ముగియనుంది. ఈ క్రమంలో జూన్‌ చివరి వారం లేదా జూలై మొదటి వారం నుంచి షూటింగ్‌లు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాతలు ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

Read This Story Also: ఎన్టీఆర్‌ రూల్.. ‘పాన్‌ ఇండియా’ కాదు ‘కంటెంట్‌’ ముఖ్యం..!

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?