య‌శ్ దుమ్ములేపాడు…కేజీఎఫ్-2 డిజిట‌ల్ రైట్స్ రికార్డు ధ‌ర‌కు..!

య‌శ్ దుమ్ములేపాడు...కేజీఎఫ్-2 డిజిట‌ల్ రైట్స్ రికార్డు ధ‌ర‌కు..!

యశ్​ హీరోగా, ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో వ‌చ్చిన ‘కేజీఎఫ్​’.. దేశవ్యాప్తంగా పెను ప్ర‌కంప‌న‌లు క్రియేట్ చేసింది. అంత‌కుముందు వ‌ర‌కు క‌న్న‌డ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో త‌ప్ప బ‌య‌ట ఎవ‌రికీ తెలియ‌ని య‌శ్ ఓవ‌ర్ నైట్ సూప‌ర్ స్టార్ అయిపోయాడు. ఫ‌స్ట్ పార్ట్ బ్లాక్​బాస్టర్​ విజయం సాధించడం వల్ల రెండో భాగంపై భారీ క్రేజ్​ నెలకొంది. ఈ క్రమంలో ‘కేజీఎఫ్​ ఛాప్టర్​ 2’కు సంబంధించిన డిజిటల్​ హక్కులను రూ.55 కోట్లతో అమెజాన్​ ప్రైమ్​ కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. ‘బాహుబలి సిరీస్ […]

Ram Naramaneni

|

May 11, 2020 | 4:28 PM

యశ్​ హీరోగా, ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో వ‌చ్చిన ‘కేజీఎఫ్​’.. దేశవ్యాప్తంగా పెను ప్ర‌కంప‌న‌లు క్రియేట్ చేసింది. అంత‌కుముందు వ‌ర‌కు క‌న్న‌డ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో త‌ప్ప బ‌య‌ట ఎవ‌రికీ తెలియ‌ని య‌శ్ ఓవ‌ర్ నైట్ సూప‌ర్ స్టార్ అయిపోయాడు. ఫ‌స్ట్ పార్ట్ బ్లాక్​బాస్టర్​ విజయం సాధించడం వల్ల రెండో భాగంపై భారీ క్రేజ్​ నెలకొంది. ఈ క్రమంలో ‘కేజీఎఫ్​ ఛాప్టర్​ 2’కు సంబంధించిన డిజిటల్​ హక్కులను రూ.55 కోట్లతో అమెజాన్​ ప్రైమ్​ కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం.

‘బాహుబలి సిరీస్ తర్వాత హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన‌ పాన్​ఇండియా చిత్రం ‘కేజీఎఫ్​. అందుకే అంత రేటు పెట్టి దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఈ సినిమా ఆన్​లైన్​ హక్కులను అమెజాన్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది‌. ​ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం డిజిటల్​ హక్కులను కొనుగోలు చేసిన అమెజాన్​.. రెండో భాగాన్నీ ద‌క్కించుకోవ‌డం విశేషం.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu