AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫర్లు నిల్.. సంచలన నిర్ణయం తీసుకున్న రకుల్

ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్‌కు సౌతిండస్ట్రీలో ఈ సంవత్సరం పెద్దగా అచ్చి రాలేదు. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో ఆమెకు అన్ని పరాజయాలే పడ్డాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, దేవ్, ఎన్జీకే, మన్మథుడు 2 ఇలా ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. మరోవైపు టాలీవుడ్‌లో ఇప్పుడు పూజా హెగ్డే, రష్మిక హవా నడుస్తుండగా.. ఆమె చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. ఈ నేపథ్యంలో రకుల్ ఓ డెసిషన్ తీసుకున్నట్లు టాలీవుడ్‌లో టాక్ […]

ఆఫర్లు నిల్.. సంచలన నిర్ణయం తీసుకున్న రకుల్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 15, 2019 | 2:00 PM

Share

ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్‌కు సౌతిండస్ట్రీలో ఈ సంవత్సరం పెద్దగా అచ్చి రాలేదు. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో ఆమెకు అన్ని పరాజయాలే పడ్డాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, దేవ్, ఎన్జీకే, మన్మథుడు 2 ఇలా ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. మరోవైపు టాలీవుడ్‌లో ఇప్పుడు పూజా హెగ్డే, రష్మిక హవా నడుస్తుండగా.. ఆమె చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. ఈ నేపథ్యంలో రకుల్ ఓ డెసిషన్ తీసుకున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అదేంటంటే తన రెమ్యునరేషన్‌ను 25శాతం తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఫిలింనగర్ వర్గాల ప్రకారం రకుల్‌ ఇప్పుడు రూ.2కోట్ల వరకు అందుకుంటున్నట్లు టాక్.

ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో ఆఫర్లు లేకపోవడంతో రకుల్, తాను హైదరాబాద్‌లో కొనుగోలు చేసిన ఇళ్లను అమ్మేసిందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటిని ఖండించిన రకుల్.. ఇలాంటి చెత్త వార్తలు ఎందుకు సృష్టిస్తారో అంటూ మండిపడింది. తాను టాలీవుడ్‌ను వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. కాగా ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. కోలీవుడ్‌లో రవికుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం, కమల్ హాసన్ ‘ఇండియన్‌ 2’, బాలీవుడ్‌లో అర్జున్ కపూర్ సరసన మరో సినిమాలో రకుల్ నటిస్తోంది.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్