Shekar Trailer: రాజశేఖర్‌ మరో హిట్‌ కొట్టేలా ఉన్నాడే.. ఇంట్రెస్టింగ్‌గా ‘శేఖర్‌’ సినిమా ట్రైలర్‌..

Shekar Trailer: ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులకు ఉర్రూతలుగించిన రాజశేఖర్‌ తర్వాత కొంతకాలం సినిమాలు గ్యాప్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత 'గరుడ వేగ' సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశాడు. మరోసారి పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో...

Shekar Trailer: రాజశేఖర్‌ మరో హిట్‌ కొట్టేలా ఉన్నాడే.. ఇంట్రెస్టింగ్‌గా 'శేఖర్‌' సినిమా ట్రైలర్‌..
Shekar Movie Trailer
Follow us
Narender Vaitla

|

Updated on: May 06, 2022 | 9:30 AM

Shekar Trailer: ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులకు ఉర్రూతలుగించిన రాజశేఖర్‌ తర్వాత కొంతకాలం సినిమాలు గ్యాప్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత ‘గరుడ వేగ’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశాడు. మరోసారి పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో దుమ్మురేపాడు. ఇక ఈ సినిమా తర్వాత కల్కీ సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్నాడు. ఇక ‘శేఖర్‌’ సినిమాతో మరోసారి ప్రేక్షకులు ఆలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 20న విడుదల కానున్న విడుదల కానున్న ఈ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌కు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘జోసెఫ్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించారు. రిటైర్‌ అయిన పోలీస్‌ ఉద్యోగి, తన భార్య యాక్సిడెంట్‌ వెనకా ఉన్న కుట్ర కోణాన్ని ఎలా చేధించాడన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేసింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. కేవలం 24 గంట్లోనే ఏకంగా 1.5 మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. దీంతో సినిమాకు పాజిటివ్‌ బజ్‌ పెరిగింది. దీంతో రాజశేఖ్‌ గరుడ వేగలాంటి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వస్తున్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటో తెలియాంటే మే 20 వరకు వేచి చూడాల్సిందే.

శేఖర్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: ఈ వ్యక్తి క్రియేటివిటీ మాములుగా లేదుగా !! రేస్‌ కార్‌లో వెళ్లి పాలు పోస్తున్న పాలవ్యాపారి

Viral Video: గెలవాలంటే ఆ రెండూ అవసరం అని చాటిచెప్పిన బుడ్డోడు.. వీడియో చూస్తే సెల్యూట్ చేస్తారు..!

దేశంలో 10 కోట్ల ఉద్యోగాలున్నా.. నైపుణ్య యువత కొరత: AICTE