RRR Movie OTT: దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan), యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( JR.NTR) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ (RRR). బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఓలివియా మోరీస్, శ్రియాశరణ్, అజయ్‌దేవ్‌గణ్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ పీరియాడికల్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అల్లూరిగా రామ్‌చరణ్, భీమ్‌గా ఎన్టీఆర్ ఆయా పాత్రల్లో ఒదిగిపోగా.. రాజమౌళి టేకింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించాను. కాగా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ పాన్ ఇండియా మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది.
ఆర్‌ఆర్‌ఆర్ హిందీ డబ్బింగ్ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అప్పటి నుంచి నేటి వరకూ 45 మిలియన్ అవర్స్ ఆర్‌ఆర్‌ఆర్ స్ట్రీమింగ్ అయిందట. ఈక్రమంలో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా జక్కన్న సినిమా అరుదైన రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇక థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కలెక్షన్లను కొల్లగొట్టింది ఆర్‌ఆర్‌ఆర్. ఆతర్వాత హిందీ డబ్బింగ్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుండగా.. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ వెర్షన్‌లు ప్రముఖ ఓటీటీ జీ5 వేదికగా స్ట్రీమ్ అవుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను ఐమ్యాక్స్, 3డీ, డాల్బీ సినిమా వెర్షన్‌లోనూ విడుదల చేశారు దర్శక నిర్మాతలు.
RRR is now the most popular Indian film on Netflix around the world ??
Sending the biggest ? to fans everywhere! pic.twitter.com/WEOw0nb515— Netflix India (@NetflixIndia) June 23, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..