యంగ్ హీరో సరసన బెల్లం శ్రీదేవి..!

యంగ్ హీరో సరసన బెల్లం శ్రీదేవి..!

తమిళ హిట్ సినిమా ‘రట్ససన్’ ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని రైడ్ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ లేదా రాశి ఖన్నాని తీసుకోనున్నట్లు గా అప్పట్లో ప్రచారం జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారక ప్రకటన ఇవ్వనుంది చిత్ర […]

TV9 Telugu Digital Desk

|

Feb 20, 2019 | 3:37 PM

తమిళ హిట్ సినిమా ‘రట్ససన్’ ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని రైడ్ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ లేదా రాశి ఖన్నాని తీసుకోనున్నట్లు గా అప్పట్లో ప్రచారం జరిగింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారక ప్రకటన ఇవ్వనుంది చిత్ర యూనిట్. మార్చి చివరి వారంలో మొదలుకానున్న ఈ చిత్రం తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం తేజ డైరెక్షన్ లో ‘సీత’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్. సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.  

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu