Pushpa: ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏలుతోన్న పుష్ప.. ఆ రికార్డులన్నీ ఫసక్..
ఇండియన్ సినిమా ఆడియన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప2 విడుదలకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 5వ తేదీన థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ప్రారంభం కాగా సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అరుదైన రికార్డును సొంతం చేసుకుందీ మూవీ..
పుష్ప.. పుష్ప.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే మేనియా. మరో మూడు రోజుల్లో పుష్ప2 థియేటర్లలోకి వస్తున్న సందర్భంగా దేశమంతా ఈ సినిమా గురించే బజ్ నడుస్తోంది. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. పుష్ప ఫస్ట్ పార్ట్‌కి మించి పార్ట్ 2 ఉండనుందని సుకుమార్ ఇప్పటికే పలుసార్లు ధీమా వ్యక్తం చేశారు.
ఇక భారీ అంచనాల నడుమ విడుదలవుతోన్న ఈ సినిమాకు ప్రమోషన్స్‌ను కూడా అదే స్థాయిలో చేపడుతున్నారు చిత్ర యూనిట్. బిహార్‌లో మొదలైన ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. మూడేళ్ల కష్టానికి తగ్గ ఫలితం, విడుదలకు ముందే కనిపిస్తోంది. ఇప్పటికే ఓవర్‌సీస్ బిజినెస్‌లో దుమ్మురేపిన పుష్ప.. ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా అరుదైన రికార్డులను తిరగరాస్తోంది.
ఇండియాలో మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్‌లో కేవలం 12 గంటల్లోనే పఠాన్, గదర్ 2, కేజీఎఫ్- 2 లాంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను అధిగమించిందీ మూవీ. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఈ సినిమా ఏకంగా రూ. 10 కోట్లు రాబట్టింది. 12 గంటల్లో 3 లక్షలకుపైగా టికెట్స్ అమ్ముడుపోయి అరుదైన ఘనతను సాధించింది. గతేడాది వచ్చిన షారుఖ్ పఠాన్ మూవీ 2 లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. ఇప్పుడు పుష్ప2 ఈ రికార్డును బ్రేక్ చేసింది. అయితే విడుదల సమయానికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఎర్రచందనం సిండికేట్‌గా అధినేతగా ఎదిగిన పుష్ప జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. పగతో రగిలిపోయిన పోలీస్ ఆఫీసర్ షేకావత్ పుష్పపై రివేంజ్ తీసుకోవడానికి ఏం చేశాడు. ఇలా ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి పుష్ప2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
పుష్ప2 ‘పీలింగ్స్’ సాంగ్..
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..