నా ఊపిరి ఆగిపోయేవరకు ఇక్కడే..!

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్‌ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు పూర్తి అయ్యింది. పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన బద్రి సినిమా ద్వారా దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూరీ

  • Tv9 Telugu
  • Publish Date - 7:56 am, Mon, 20 April 20
నా ఊపిరి ఆగిపోయేవరకు ఇక్కడే..!

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్‌ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు పూర్తి అయ్యింది. పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన బద్రి సినిమా ద్వారా దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూరీ.. ఈ 20 సంవత్సరాల్లో 34 సినిమాలను తెరకెక్కించారు. రెండు సినిమాలకు కథలను అందించారు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమాకు పూరీ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా సినిమా ఇండస్ట్రీలో పూరీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో.. సోషల్ మీడియాలో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

సినీ ప్రముఖులందరూ ఆయనకు అభినందనలు చెబుతున్నారు. కరణ్‌ జోహార్, రామ్‌ పోతినేని, అనూప్ రూబెన్స్, నిధి అగర్వాల్ తదితరులు పూరీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి థ్యాంక్స్‌ చెప్పారు ఈ దర్శకుడు. ఈ క్రమంలో హీరో రామ్ చేసిన ట్వీట్‌కు స్పందించిన పూరీ.. నా ఊపిరి ఆగిపోయేవరకు సినిమాలకే అంకితం అవుతా అని కామెంట్ చేశారు. కాగా ఫైటర్‌ రెండు భాషల్లో విడుదల కాబోతుండగా.. ఈ మూవీపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

Read This Story Also: ఆన్‌లైన్ క్లాస్‌లు వింటోన్న నిధి .. ఏ కోర్సు తీసుకుంటుందో తెలుసా..!