AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur Kaaram: ఈ సంక్రాంతికి మహేష్‌ డౌటేనా.? గుంటూరు కారం రిలీజ్‌పై ప్రొడ్యుసర్‌ ఏమన్నారంటే..

ఈ ఏడాది సంక్రాంతికి కూడా మహేష్‌ నటించిన గుంటూరు కారం చిత్రం రానుందని మొదటి నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్‌, మహేష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాపై మొదటి నుంచి రుమర్ల వర్షం కురుస్తూనే ఉంది. ఈ సినిమా నుంచి సంగీత దర్శకుడిగా తమన్‌ను తొలగించి మరొకరిని తీసుకోనున్నారని, వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే...

Guntur Kaaram: ఈ సంక్రాంతికి మహేష్‌ డౌటేనా.? గుంటూరు కారం రిలీజ్‌పై ప్రొడ్యుసర్‌ ఏమన్నారంటే..
Guntur Kaaram
Narender Vaitla
|

Updated on: Oct 03, 2023 | 1:02 PM

Share

సంక్రాంతి పండుగను, టాలీవుడ్‌ను విడదీసి చూడలేము. సంక్రాంతి వచ్చిందంటే చాలు బడా హీరోల సినిమాలతో థియేటర్లన్నీ పండగ కళను సంతరించుకుంటాయి. అందుకే చిన్ని చిన్ని సినిమాలతో పాటు బడా చిత్రాలను సైతం సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్‌ చేసుకుంటారు. ఇలా సంక్రాంతికి సినిమాలను విడుదల చేసే హీరోల్లో మహేష్‌ కూడా ఒకరు. ఇప్పటి వరకు సంక్రాంతికి విడుదలైన మహేష్‌ చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను నమోదు చేసుకున్న ట్రాక్‌ రికార్డ్‌ ఉంది.

ఈ ఏడాది సంక్రాంతికి కూడా మహేష్‌ నటించిన గుంటూరు కారం చిత్రం రానుందని మొదటి నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్‌, మహేష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాపై మొదటి నుంచి రుమర్ల వర్షం కురుస్తూనే ఉంది. ఈ సినిమా నుంచి సంగీత దర్శకుడిగా తమన్‌ను తొలగించి మరొకరిని తీసుకోనున్నారని, వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తర్వాత అవన్నీ పుకార్లేనని తేలింది. ఇక నటి పూజా హెగ్డే బాలీవుడ్‌ సినిమా కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్న విషయం కూడా విధితమే.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాదంటూ మరో వార్త నెట్టింట వైరల్‌ అయ్యింది. చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్‌డేట్స్‌ ఇవ్వకపోతుండడంతో సినిమా షూటింగ్‌ పూర్తి కాలేదని, అందుకే సంక్రాంతికి సినిమా థియేటర్లలోకి రాదని వార్త ఒకటి నెట్టింట తెగ ట్రెండ్‌ అయ్యింది. అయితే ఈ వార్తలపై ఎట్టకేలకు అధికారికంగా స్పందించారు చిత్ర నిర్మాత నాగ వంశీ. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా విడుదలపై అధికారికంగా ప్రకటన చేశారు.

గుంటూరుకారం సినిమా వాయిదా పడనుందన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పిన సూర్యదేవర నాగవంశీ.. 200 శాతం సినిమా సంక్రాంతికే వస్తుందని తేల్చి చెప్పారు. అక్టోబర్ 20వ తేదీ నాటికి టాకీ పోర్షన్‌ షూటింగ్ పూర్తి అవుతుందని, మరో నాలుగు పాటలు మాత్రమే బ్యాలన్స్‌ ఉంటుందని, అవి పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు మొదలు పెడతామని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో గుంటూరు కారం సినిమాపై జరుగుతోన్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లైంది. ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమా నైజాం రైట్స్‌ను నిర్మాత దిల్‌రాజు రికార్డు రేటుకు కొనుగోలు చేయడం విశేషం. ఇక దసరా కానుకగా ఈ సినిమా ఫస్ట్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి…