F3 Moive: విడుదలకు ముందు ఎఫ్3 నుంచి క్రేజీ అప్‌డేట్.. సినిమాలో పవన్‌తో పాటు మరికొందరు టాప్ హీరోలు..
F3 Moive: చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది ఎఫ్2. విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు నవ్వుల వర్షంతో పాటు కలెక్షన్ల వర్షం కూడా కురిపించిన విషయం తెలిసిందే...
F3 Moive: చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది ఎఫ్2. విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు నవ్వుల వర్షంతో పాటు కలెక్షన్ల వర్షం కూడా కురిపించిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కిన విషయం తెలిసిందే. మరికాసేపట్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
ఎఫ్3 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన దిల్ రాజు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అంశాన్ని తెలిపారు. ఎఫ్3లో పవన్ కళ్యాణ్ కనిపించనున్నట్లు దిల్‌రాజు తెలిపారు. కేవలం పవన్ మాత్రమే కాకుండా టాలీవుడ్‌కు చెందిన టాప్ స్టార్స్ సినిమాలో కనిపించేటట్లు అనిల్ ఓ ఎపిసోడ్‌ను క్రియేట్ చేశాడని దిల్‌రాజు తెలిపారు.
మరి సినిమాలో ఈ హీరోలు నిజంగానే కనిపిస్తారా.? లేదా వారి చిత్రాలకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయా.? తెలియాలంటే సినిమా థియేటర్లలో వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక ఎఫ్3 సినిమా గురించి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకుందుంటుందని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. మరి ఎఫ్3 ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..