AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఆ సినిమాను ఉపేంద్రకు 10 లక్షలకు అమ్మాను.. రూ.50 లక్షల ఆదాయం వచ్చింది.. టాలీవుడ్ నిర్మాత..

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఉప్పి గా సుపరిచితులైన ఉపేంద్ర రావు, భారతీయ సినీ నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాతగా రాణిస్తున్నారు.. ప్రధానంగా కన్నడ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని సృష్టించుకున్న ఆయన, తెలుగు , తమిళ చిత్రాలలో కూడా నటించి అపారమైన ప్రజాదరణ పొందారు.

Cinema : ఆ సినిమాను ఉపేంద్రకు 10 లక్షలకు అమ్మాను.. రూ.50 లక్షల ఆదాయం వచ్చింది.. టాలీవుడ్ నిర్మాత..
Raa Movie
Rajitha Chanti
|

Updated on: Jun 10, 2026 | 6:04 PM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బెల్లంకొండ సురేష్. ఎన్నో వైవిధ్యమైన, భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన ఆయన, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు , కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రతో తాను నిర్మించిన ‘రా’ (Ra) సినిమా వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన నిజాలను పంచుకున్నారు. ‘సాంబయ్య’ సినిమా విజయంతో తనకు 50 లక్షల రూపాయల భారీ లాభం వచ్చిందని, దాంతో అప్పట్లో తాను చాలా రిచ్ అయిపోయానని బెల్లంకొండ తెలిపారు.. ఆ ఊపులోనే కేవలం ఆరు నెలల వ్యవధిలో విజయశాంతి, రాజశేఖర్, ఉపేంద్రలతో ఒకే రోజు మూడు సినిమాలను రామానాయుడు స్టూడియోలో ప్రారంభించినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే అందులో ఉపేంద్ర నటించిన ‘రా’ సినిమా పంపిణీదారులకు, భాగస్వాములకు నచ్చకపోవడంతో సుమారు ఒకటిన్నర సంవత్సరం పాటు ఆగిపోయింది.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..

సినిమా ల్యాబ్‌లోనే ఆగిపోవడంతో అప్పట్లో ఆ ప్రాజెక్ట్‌పై రూ.80 లక్షల ఫైనాన్స్ భారం పడింది. భాగస్వాములు తప్పుకోవడంతో, బెల్లంకొండ సురేష్ ఆ భారాన్ని తనపై వేసుకుని సినిమా నెగిటివ్‌ను హీరో ఉపేంద్ర వద్దకు పంపారు. ఉపేంద్ర ఆ అవుట్‌పుట్ చూసి, టోటల్ రష్ ఎక్కడ ఉందో కనుక్కుని, తన సొంత ఎడిటర్‌ను పిలిపించి సినిమాను సరికొత్తగా రీ-ఎడిట్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..

ఉపేంద్ర మార్చిన ఎడిటింగ్ వెర్షన్‌ను రామానాయుడు స్టూడియోలో చూసిన బెల్లంకొండ సురేష్ షాక్‌కు గురయ్యారు. సినిమా మునుపటి కంటే ఎంతో అద్భుతంగా రావడంతో, వెంటనే ఆ కాపీని ప్రముఖ నిర్మాత డి. రామానాయుడుకి చూపించారు.. సినిమా కంటెంట్‌ను నమ్మిన రామానాయుడు . ఈస్ట్, వెస్ట్ గోదావరి, నెల్లూరు , సీడెడ్ హక్కుల కోసం అప్పట్లోనే రూ.50 లక్షల సింగిల్ చెక్ ఇచ్చి బెల్లంకొండను ఆదుకున్నారు. అలా ఎన్నో అడ్డంకులను దాటుకుని విడుదలైన ‘రా’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి, బెల్లంకొండ సురేష్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది.

ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: ఒకప్పుడు లవర్ బాయ్.. వడ్డె నవీన్ కొడుకును చూశారా.. ? వైరలవుతున్న ఫోటోస్..

ఎక్కువ మంది చదివినవి : Sirivennela Sitaramasastri : మనిషి జీవితంలో ఎదగటానికి ఈ లక్షణాలు ఉంటే చాలు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి..

Follow Us
10 లక్షలకు ఆ సినిమా కొన్న ఉపేంద్ర.. కట్ చేస్తే.. నిర్మాతకు రూ.50
10 లక్షలకు ఆ సినిమా కొన్న ఉపేంద్ర.. కట్ చేస్తే.. నిర్మాతకు రూ.50
హిట్‌మ్యాన్ ఇచ్చిన టిప్స్‌తో ఇండియాకే స్కెచ్ వేశాడుగా..
హిట్‌మ్యాన్ ఇచ్చిన టిప్స్‌తో ఇండియాకే స్కెచ్ వేశాడుగా..
వర్షాకాలంలో జబ్బులను తరిమికొట్టే సూపర్ డ్రింక్.. డేలీ తాగితే
వర్షాకాలంలో జబ్బులను తరిమికొట్టే సూపర్ డ్రింక్.. డేలీ తాగితే
రాహువు కటాక్షం.. వచ్చే 5 నెలలు ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్
రాహువు కటాక్షం.. వచ్చే 5 నెలలు ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?