ట్రోల్స్‌లో నెం. 1′ సాహో ‘
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , శ్రద్ధా కపూర్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’ 2019 సంవత్సరంలో అత్యధికంగా ట్రోల్ చేయబడిన సినిమాగా కొత్త రికార్డ్ ని ఖాతాలో వేసుకుంది. మూవీ సీన్స్ ని ఉన్నదానికంటే ఎక్కువగా చిత్రీకరించి చూపించడం, యాక్షన్ సీన్స్ అన్నీ పబ్జీలాంటి గేమ్లని తలపించడంతో ఈ మూవీ ట్రోల్స్ కి మంచి స్టఫ్ గా మారిపోయింది. ఆగస్టు నెలలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో చాలా గ్రాండ్‌గా విడుదలైంది ఈ మూవీ. విడుదలకు ముందు […]

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , శ్రద్ధా కపూర్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’ 2019 సంవత్సరంలో అత్యధికంగా ట్రోల్ చేయబడిన సినిమాగా కొత్త రికార్డ్ ని ఖాతాలో వేసుకుంది. మూవీ సీన్స్ ని ఉన్నదానికంటే ఎక్కువగా చిత్రీకరించి చూపించడం, యాక్షన్ సీన్స్ అన్నీ పబ్జీలాంటి గేమ్లని తలపించడంతో ఈ మూవీ ట్రోల్స్ కి మంచి స్టఫ్ గా మారిపోయింది.
ఆగస్టు నెలలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో చాలా గ్రాండ్‌గా విడుదలైంది ఈ మూవీ. విడుదలకు ముందు భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చినా.. సినిమా కాస్తా ధియేటర్లలోకి వచ్చేసరికి అన్ని అంచనాలు రివర్స్ అయ్యాయి. దీంతో సుజిత్ డైరెక్షన్.. నెగటివ్ రివ్యూలు, నవ్వించే మీమ్స్‌కు ఆహారంలా మారింది.
సినీ క్రిటిక్స్ సాహోను ఎగతాళి చేసి, దీన్ని ఈ దశాబ్దంలోనే వరస్ట్ మూవీ అంటూ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే కాదు, అమెజాన్ ప్రైమ్ లో 19 అక్టోబర్ 2019 న స్ట్రీమ్ అయింది. అప్పుడు కూడా ఈ సినిమాపై మళ్లీ సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురిసింది.. ఇక సాహోతో పాటు బాలీవుడ్ సినిమాలు కలంక్, కబీర్ సింగ్,హౌస్‌ఫుల్ 4 కూడా 2019 లో అత్యధికంగా ట్రోల్ చేయబడిన సినిమాల జాబితాలో ఉన్నాయి.