ప్రభాస్ బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్.. ‘ఆది పురుష్’గా రెబల్‌స్టార్
రెబల్‌స్టార్ ప్రభాస్ తన అభిమానులకు మరో బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ ఇచ్చేశారు. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి సాధించిన ఈ నటుడు ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు

Prabhas in Adipurush: రెబల్‌స్టార్ ప్రభాస్ తన అభిమానులకు మరో బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ ఇచ్చేశారు. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి సాధించిన ఈ నటుడు ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రముఖ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నారు. ‘ఆది పురుష్’ అనే టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. చెడుపై మంచి సాధించిన విజయం అనే థీమ్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ టైటిల్ లుక్‌ని కూడా విడుదల చేసింది. అందులో రామాయణంలో ఉన్న రాముడు, హనుమంతుడు, రావణాసురుడి పాత్రలు ఉన్నాయి. చూస్తుంటే ఈ మూవీ రామాయణం బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కనుండగా.. భూషణ్ కుమార్, ప్రశాంత్ కుమార్ ‘ఆది పురుష్’ని నిర్మించనున్నారు. కాగా ప్రస్తుతం ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్‌లో నటిస్తుండగా.. ఈ మూవీ తరువాత మహా నటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ రెండు మూవీల తరువాత ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నారు.
Read More:
మరో కరోనా లక్షణం.. బాధితుల్లో హెయిర్ లాస్..!