భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తోన్న ర‌ష్మిక‌?

సాధార‌ణంగా న‌ట‌న‌లో నైపుణ్యంతో పాటు అభిమానుల్లో క్రేజ్ ఉంటే చాలు.. హీరోయిన్లు అందుకునే రెమ్యున‌రేష‌న్ గురించి స‌ప‌రేటుగా చెప్పాల్సిన‌వ‌స‌రం లేదు. అందులోనూ వ‌రుస హిట్స్ ప‌డితే ఇక వారికి ఇండ‌స్ట్రీలో తిరుగు ఉండదు. వారు ఎంత డిమాండ్ చేస్తే నిర్మాత‌లు అంత..

  • Tv9 Telugu
  • Publish Date - 11:19 pm, Mon, 17 August 20
భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తోన్న ర‌ష్మిక‌?

దేశ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌త ఎంత‌లా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. పాజిటివ్ కేసుల విష‌యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా మూడో స్థానంలో ఉంది భార‌త్. ఇక ఈ క‌రోనా వైర‌స్ కార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీ స్తంభించిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చాలా సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. షూటింగుల‌న్నీ కూడా నిలిచిపోయాయి. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో హీరోయిన్స్ రెమ్యున‌రేష‌న్ పెంచ‌డ‌మంటే మామూలు విష‌యం కాదు.

సాధార‌ణంగా న‌ట‌న‌లో నైపుణ్యంతో పాటు అభిమానుల్లో క్రేజ్ ఉంటే చాలు.. హీరోయిన్లు అందుకునే రెమ్యున‌రేష‌న్ గురించి స‌ప‌రేటుగా చెప్పాల్సిన‌వ‌స‌రం లేదు. అందులోనూ వ‌రుస హిట్స్ ప‌డితే ఇక వారికి ఇండ‌స్ట్రీలో తిరుగు ఉండదు. వారు ఎంత డిమాండ్ చేస్తే నిర్మాత‌లు అంత ఇవ్వాల్సిందే. అయితే క‌రోనా కార‌ణంగా హీరోయిన్స్ త‌మ రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. కానీ ర‌ష్మిక మాత్రం ఇందుకు రివ‌ర్స్‌గా ఉంది. కొత్త సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వాలంటే భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేస్తోంద‌ని టాక్. అలాగే స్టార్ డ‌మ్ లేని హీరోల ప్రాజెక్టులకు కూడా నో చెబుతోంద‌ట ఈ భామ‌. ఇటీవ‌లే ర‌ష్మిక స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ సినిమాల‌తో సూప‌ర్ హిట్‌లు అందుకుంది.

Also Read:

సినీ న‌టి మాధ‌విల‌త‌పై కేసు న‌మోదు

భారీ వ‌ర్షాల‌కు కూలిన రోడ్డు.. లోయ‌లో ప‌డిన వాహ‌నాలు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం