భారత బాక్సర్ సరితా దేవికి కరోనా పాజిటివ్
తాజాగా సోమవారం భారత బాక్సర్ సరితా దేవి తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు ట్వీట్టర్ వేదికగా తెలిపింది. ''గడిచిన మూడు రోజులుగా తనను జ్వరం, కండరాల నొప్పితో బాధిస్తుండడంతో కోవిడ్ నిర్థారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని..

దేశ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే కదా. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు ఈ వైరస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం భారత బాక్సర్ సరితా దేవి తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు ట్వీట్టర్ వేదికగా తెలిపింది. ”గడిచిన మూడు రోజులుగా తనను జ్వరం, కండరాల నొప్పితో బాధిస్తుండడంతో కోవిడ్ నిర్థారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తన భర్తకు సైతం పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని, కుమారుడికి మాత్రం నెగిటివ్ ”వచ్చిందని ఆమె ట్వీట్‌లో వెల్లడించారు.
Also Read:
మళ్లీ పెరుగుతోన్న పెట్రోల్ ధరలు
బ్రేకింగ్ః ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం



