AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ ఫ్యాన్స్‌ గరం గరం.. స్పందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ

లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా షూటింగ్‌లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ఈ లాక్‌డౌన్‌ను కొంతమంది దర్శకులు ప్రమోషన్ల కోసం ఉపయోగించుకుంటున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్‌ గరం గరం.. స్పందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 07, 2020 | 2:28 PM

Share

లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా షూటింగ్‌లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ఈ లాక్‌డౌన్‌ను కొంతమంది దర్శకులు ప్రమోషన్ల కోసం ఉపయోగించుకుంటున్నారు. మోషన్‌ పోస్టర్లు, ఫస్ట్‌లుక్‌ లాంటివి విడుదల చేసి.. తమ తమ సినిమాలపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టీమ్‌ టైటిల్‌ మోషన్ పోస్టర్‌తో పాటు చెర్రీకి సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఇక ఎన్టీఆర్‌ వీడియోపై కూడా ఇప్పుడు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక మరోవైపు అల్లు అర్జున్ టీమ్‌ కూడా ప్రమోషన్లను ప్రారంభించేసింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న AA20కి సంబంధించిన అప్‌డేట్‌ను బుధవారం బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. ఇలా మిగిలిన హీరోలు ప్రమోషన్లను చేస్తుంటే.. ప్రభాస్‌ టీమ్ మాత్రం సైలెంట్‌గా ఉంది. దానికి తోడు త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని దర్శకుడు రాధాకృష్ణకుమార్ ఆ మధ్యన ప్రకటించినప్పటికీ.. తరువాత ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దీంతో యూవీ క్రియేషన్స్‌పై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు. #BanUVCreations అంటూ వారు కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో యూవీ క్రియేషన్స్‌ స్పందించింది. ”ప్రపంచమంతా ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితిపై మేము చింతిస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మా పనులన్నీ మేము ఆపేశాం. ఒక్కసారి అన్ని పరిస్థితులు సర్దుకున్నాక.. మేము చాలా అప్‌డేట్లు ఇస్తాం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇంట్లో ఉండి సురక్షితంగా ఉండండి అని అందరినీ కోరుతున్నాం” అని యూవీ క్రియేషన్స్‌ తెలిపింది. మరి ఇప్పటికైనా ప్రభాస్ ఫ్యాన్స్ కూల్ అవుతారేమో చూడాలి.

Read This Story Also: ఏపీలో నాలుగో కరోనా మృతి.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..!

ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
జీవితాన్నే మార్చే మిర్రర్ అవర్.. ఈరోజు స్పెషాలిటీ తెలుసా?
జీవితాన్నే మార్చే మిర్రర్ అవర్.. ఈరోజు స్పెషాలిటీ తెలుసా?
కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
పొద్దుపొద్దున్నే ఈ అలవాటు మానుకుంటే మీ ఒంట్లో విషం చేరినట్టే!
పొద్దుపొద్దున్నే ఈ అలవాటు మానుకుంటే మీ ఒంట్లో విషం చేరినట్టే!
రూ.1 లక్ష పెట్టుబడితో రూ. 3 లక్షలు.. డిమాండ్ తగ్గని వ్యాపారం!
రూ.1 లక్ష పెట్టుబడితో రూ. 3 లక్షలు.. డిమాండ్ తగ్గని వ్యాపారం!
కష్టపడిన విలువ రాదు.. జబర్దస్త్ రోహిణి..
కష్టపడిన విలువ రాదు.. జబర్దస్త్ రోహిణి..
ఆ 3 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ..
ఆ 3 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ..