AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పింక్‌ రీమేక్‌.. అజిత్‌ ఫస్ట్‌ లుక్‌

తమిళనాట మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోల్లో అజిత్ ముందు వరుసలో ఉంటాడు. అలాంటి మాస్ యాక్షన్ హీరో బాలీవుడ్ ‘పింక్’ మూవీ రీమేక్ లో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ప్రేక్షకులతో పాటు అజిత్ ఫ్యాన్స్ కూడా ‘పింక్’ మూవీ రీమేక్ వార్తలను కొట్టి పారేశారు. ఆమద్య దర్శకుడు హెచ్ వినోద్ రీమేక్ వార్తలను కొట్టి పారేశాడు. ఆయన రీమేక్ లేదు అంటూ చెప్పిన నేపథ్యంలో ఆ సినిమా గురించి చర్చ దాదాపుగా ఆగిపోయింది. అయితే తాజాగా […]

పింక్‌ రీమేక్‌.. అజిత్‌ ఫస్ట్‌ లుక్‌
Ram Naramaneni
|

Updated on: Mar 05, 2019 | 8:09 PM

Share

తమిళనాట మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోల్లో అజిత్ ముందు వరుసలో ఉంటాడు. అలాంటి మాస్ యాక్షన్ హీరో బాలీవుడ్ ‘పింక్’ మూవీ రీమేక్ లో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ప్రేక్షకులతో పాటు అజిత్ ఫ్యాన్స్ కూడా ‘పింక్’ మూవీ రీమేక్ వార్తలను కొట్టి పారేశారు. ఆమద్య దర్శకుడు హెచ్ వినోద్ రీమేక్ వార్తలను కొట్టి పారేశాడు. ఆయన రీమేక్ లేదు అంటూ చెప్పిన నేపథ్యంలో ఆ సినిమా గురించి చర్చ దాదాపుగా ఆగిపోయింది. అయితే తాజాగా అజిత్ తాజా మూవీ ఫస్ట్ లుక్ వచ్చింది. అది పింక్ రీమేక్ అని క్లారిటీ వచ్చేసింది.

శ్రీదేవి చనిపోక ముందు ‘పింక్’ చిత్రాన్ని సౌత్ లో రీమేక్ చేయాలని కోరుకుంది. ఒక స్టార్ హీరోను రీమేక్ లో నటింపజేయాలని కూడా కోరుకుంది. కాని ఆ కోరిక తీరకుండానే చనిపోయింది అంటూ ఒక సందర్బంలో బోణీ కపూర్ చెప్పుకొచ్చాడు. తమిళంలో ‘పింక్’ రీమేక్ చేస్తానంటూ అప్పుడే బోణీ కపూర్ ప్రకటించాడు. అన్నట్లుగానే బోణీ కపూర్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. శ్రీదేవితో అజిత్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె రీ ఎంట్రీ మూవీ ఇంగ్లీష్ వింగ్లీష్ లో ఆమెతో ఉన్న స్నేహం కారణంగా చిన్న గెస్ట్ రోల్ ను పోషించాడు.

ఇప్పుడు ఆమె చివరి కోరిక అయిన ‘ఫింక్’ మూవీ రీమేక్ లో నటిస్తున్నాడు. కోర్టు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అజిత్ లాయర్ గా కనిపించబోతున్నాడు. మాస్ సినిమాలనే అధికంగా చేసే అజిత్ ఇలాంటి సినిమాను కేవలం శ్రీదేవితో ఉన్న స్నేహంతోనే చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ రీమేక్ లో కన్నడ స్టార్ హీరోయిన్ శ్రద్దా శ్రీనాద్ నటిస్తోంది. ఆమెతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఫస్ట్ లుక్ లో అమ్మాయిలు బోనులో ఉండగా అజిత్ లాయర్ కాస్ట్యూమ్స్ లో ఉన్నాడు. కనుక ఇది ‘పింక్’ రీమేక్ అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.

Follow Us