Parthiban: ప్రముఖ నటుడికి “నో కాస్ట్ – నో రిలీజియన్” సర్టిఫికెట్..
ప్రముఖ నటుడు పార్థిబన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచుతుడే.. పలు సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించాడు. అలాగే విలన్ గాను మెప్పించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన డెకాయిట్ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు పార్థిబన్. తాజాగా ఆయనకు నో కాస్ట్ - నో రిలీజియన్ సర్టిఫికెట్ లభించింది.

ఇటీవల కులాల, అలాగే మతాల అంశం అనేది తీవ్ర ప్రభావంగా మారుతోంది.. కొందరు కులాల పేరుతో వివాదాలు చేస్తుండడం అనేకం చోటు చేసుకుంటున్నాయి.. కానీ కొందరు మాత్రం.. మాకు ఎలాంటి కులాలు.. మతాలు వద్దూ అంటూ అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు.. రెండేళ్ల క్రితం తమిళనాడులో ఓ ఉపాధ్యాయని తనకు.. తన పిల్లలకు కుల ప్రస్తావన లేకుండా సర్టిఫికెట్ కావాలని కోరారు.. తాజాగా ప్రముఖ నటుడు కూడా ఇదే కోరుకున్నారు.. తమిళ నటుడు పార్తిబన్ కు “నో కాస్ట్ – నో రిలీజియన్” (No Caste – No Religion) సర్టిఫికెట్, కులం అలాగే మతం లేవని ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాలని మద్రాస్ హైకోర్టు రెవెన్యూ అధికారులను ఆదేశించింది.
ఇది కూడా చదవండి: డార్లింగ్ సాంగ్‌ను రీ క్రియేట్ చేశారు.. నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
ఏ కుల లేదా మత వర్గం కింద వర్గీకరించబడకుండా తనకు.. అధికారిక గుర్తింపు కోరుతూ నటుడు పార్థిబన్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎం. దండపాణి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. మతపరమైన భేదాలకు అతీతంగా.. కేవలం ఒక భారత పౌరుడిగా మాత్రమే తనను తాను గుర్తించుకోవాలనే తన చిరకాల విశ్వాసం ఆధారంగా ఆయన ఈ అభ్యర్థన చేశారు.
ఇది కూడా చదవండి: ఎంత పని చేశావ్ సామి..!! రెమ్యునరేషన్ కారణంగా ప్రభాస్ సినిమాకు నో చెప్పిన నటుడు..
లౌకిక గుర్తింపును చాటుకోవడానికి తమిళనాడులో వ్యక్తులు ఇలాంటి అభ్యర్థనలు చేసిన ఉదాహరణలను ఉటంకిస్తూ, అటువంటి ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయడానికి ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేవని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు, అధికారిక రికార్డులలో స్వచ్ఛందంగా కుల, మతాలను వదులుకోవడానికి ఉన్న చట్టబద్ధతను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. దీనిపై పలువురు సోషల్ మీడియా వేదికగా భారతావనిలో అందరికీ ఇదే వర్తించేలా చేస్తే బాగుంటుంది అని అంటున్నారు.




