AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Astrology: ఈ రాశుల వారికి ఆదాయ వృద్ధి.. ఆర్థికంగా తిరుగే ఉండదు..!

రాబోయే రెండు నెలల్లో గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి వ్యయాన్ని మించి ఆదాయం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో 11వ స్థానం ఓ వ్యక్తి ఆదాయం, ఆదాయ వృద్ధిని సూచిస్తుంది. అలాగే వ్యయాన్ని 12వ స్థానం సూచిస్తుంది. 11, 12వ స్థానాలను బట్టి ఆ వ్యక్తి ఆదాయ వృద్ధి, వ్యయాలను అంచనావేయొచ్చు. వచ్చే రెండు మాసాల్లో ఏ రాశుల వారికి వ్యయం కంటే ఆదాయం ఎక్కువగా ఉంటుందో ఇక్కడ చూద్దాం..

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 25, 2026 | 12:27 PM

Share
జ్యోతిషశాస్త్రం ప్రకారం 11వ స్థానం ఒక వ్యక్తి ఆదాయాన్ని, ఆదాయ వృద్ధిని సూచిస్తుంది. ఏయే మార్గాల్లో ఆదాయం పెరిగే ఈ స్థానాన్ని బట్టే తెలుస్తుంది. ఇక 12వ స్థానాన్ని బట్టి వ్యయాన్ని చెప్పవలసి ఉంటుంది. ఏ విధంగా, ఏ స్థాయిలో ఖర్చు జరుగుతుందన్నది తెలుస్తుంది. ఆదాయ వృద్ధికి ఉన్న అవకాశాలను ఈ రెండు స్థానాలే నిర్ధారిస్తాయి. వచ్చే రెండు నెలల్లో ఈ రెండు స్థానాల అధిపతుల స్థితిగతుల ప్రకారం వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం, కుంభ రాశులకు వ్యయం కంటే ఆదాయమే బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

1 / 7
వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో శని ఉండడం, ధన స్థానంలో గురువు ఉండడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. లాభ స్థానంలో ఉన్న శని వల్ల ఆచితూచి ఖర్చు చేయడం, ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మదుపులు, పెట్టుబడుల ద్వారా ఆదాయాన్ని వృద్ధి చేసుకునే అవకాశం ఉంది. వ్యయాధిపతి కుజుడు ఏమంత బలంగా లేనందువల్ల ఖర్చులకు కళ్లెం వేయడం జరుగుతుంది. ఆదాయం పెరగడం తప్ప తగ్గడం ఉండదు.

2 / 7
సింహం: ఈ రాశికి లాభ స్థానంలో ధన కారకుడు గురువు సంచారం వల్ల ఆదాయానికి లోటుండదు. వ్యయాధిపతి చంద్రుడు అయినందువల్ల ముఖ్యమైన అవసరాలకు తప్ప వృథా ఖర్చులు ఎక్కువగా ఉండకపోవచ్చు. అనేక విధాలుగా ఆదాయాన్ని పెంచి మదుపు చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. అదనపు ఆదాయానికి బాగా అవకాశం ఉంది. మొత్తం మీద ఆదాయం ఎక్కువగానూ, వ్యయం తక్కువగానూ ఉంటుంది.

3 / 7
తుల: ఈ రాశికి లాభ స్థానాధిపతి రవి మరో మూడు నెలల పాటు అనుకూలంగా ఉండడంతో పాటు, భాగ్య స్థానంలో గురువు ఉన్నందువల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. వ్యయ స్థానాధిపతి బుధుడి అనుకూలత వల్ల ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగువేయడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల ద్వారా అదనపు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఈ రాశివారు వృథా ఖర్చుల్ని బాగా తగ్గించుకుని మదుపులు చేయడం జరుగుతుంది.

4 / 7
ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానాధిపతి శుక్రుడు అనుకూల స్థానాల్లో సంచారం చేయడం, వ్యయ స్థానాధిపతి కుజుడు కూడా చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందడం, జాగ్రత్తగా ఖర్చు చేయడం జరుగుతుంది. పొదుపు పాటించడం ఎక్కువవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో మదుపు చేసి లబ్ధి పొందుతారు. అవసర ఖర్చులకు, ఆర్థిక సమస్యల పరిష్కారానికి మాత్రమే ఖర్చు చేయడం జరుగుతుంది. భూ లాభం కలిగే అవకాశం ఉంది.

5 / 7
మకరం: ఈ రాశికి లాభాధిపతి కుజుడు తృతీయ, చతుర్థ స్థానాల్లో అనుకూలంగా ఉండడం, వ్యయాధిపతి గురువు షష్ట స్థానంలో సంచారం వల్ల ఆదాయాన్ని జాగ్రత్త చేసుకోవడం, మదుపు చేయడం ఎక్కువగా జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద శ్రద్ధాసక్తులు బాగా పెరుగుతాయి. దీనివల్ల అనవసర ఖర్చుల్ని తగ్గించుకుని, ఆదాయాన్ని పెంచుకోవడం మీద ఎక్కువగా దృష్టి పెడతారు. ధనాధిపతి శని అనుకూలత వల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది.

6 / 7
కుంభం: ఈ రాశికి లాభాధిపతి అయిన గురువు లాభస్థానాన్ని వీక్షించడం, రాశ్యధిపతి, వ్యయాధిపతి అయిన శని కూడా ధన స్థానంలోనే ఉండి, లాభ స్థానాన్ని వీక్షించడం వల్ల ఒక ప్రణాళిక ప్రకారం ఆదాయాన్ని పెంచుకోవడం, ఆచితూచి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇదివరకటి ఇప్పుడు ఆదా యం బాగా పెరిగే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. వృథాఖర్చుల్ని తగ్గించుకోవడం, లాభసాటి లావాదేవీల్లో మదుపు చేయడం వంటివి ఎక్కువగా జరుగుతాయి. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

7 / 7
Follow Us