AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ ‘వకీల్ సాబ్’ హైలెట్స్ ఇవే..!

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రం 'వకీల్ సాబ్'. హిందీలో పెద్ద విజయం సాధించిన 'పింక్' రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

పవన్ 'వకీల్ సాబ్' హైలెట్స్ ఇవే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 05, 2020 | 10:21 PM

Share

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీలో పెద్ద విజయం సాధించిన ‘పింక్’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బోని కపూర్, దిల్ రాజు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రెండున్నర ఏళ్ల తరువాత టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్నారు పవన్. కాగా తెలంగాణలో షూటింగ్‌లకు అనుమతి లభించిన నేపథ్యంలో త్వరలోనే ఈ మూవీ చిత్రీకరణను ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో హైలెట్ ఇవేనంటూ ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలోని కోర్టు సన్నివేశాలు, డైలాగ్‌లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోర్టు సన్నివేశాలు ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉండబోతున్నట్లు కూడా తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో పవన్ సరసన శ్రుతీ హాసన్‌ నటిస్తోంది. అంజలి, నివేథా థామస్‌, అనన్య, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. అన్నీ కుదిరితే అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీపై పవన్‌ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Read This Story Also: Breaking: వివాదాస్పద కథనం.. ఇద్దరిని సస్పెండ్ చేసిన టీటీడీ జేఈవో

Follow Us
IND vs SL: టీమిండియా పాలిట విలన్‌గా 'కింగ్ ఆఫ్ గాలే'..
IND vs SL: టీమిండియా పాలిట విలన్‌గా 'కింగ్ ఆఫ్ గాలే'..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. అరటిపండు వీళ్లకు యమ డేంజర్..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. అరటిపండు వీళ్లకు యమ డేంజర్..
ఆదిపూరం: గోదాదేవి అవతార రహస్యం.. భక్తికి ప్రతిరూపమైన ఆండాళ్..
ఆదిపూరం: గోదాదేవి అవతార రహస్యం.. భక్తికి ప్రతిరూపమైన ఆండాళ్..
2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి!
2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి!
వాకింగ్ ఒక్కటే కాదు.. శరీరం ఫిట్‌గా ఉండడానికి అసలైన సీక్రెట్ ..
వాకింగ్ ఒక్కటే కాదు.. శరీరం ఫిట్‌గా ఉండడానికి అసలైన సీక్రెట్ ..
కుమారీ ఆంటీ బంపరాఫర్..ఈ సినిమా టికెట్ చూపిస్తే బిల్లుపై డిస్కౌంట్
కుమారీ ఆంటీ బంపరాఫర్..ఈ సినిమా టికెట్ చూపిస్తే బిల్లుపై డిస్కౌంట్
ఉద్యోగం చేసే ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన అప్పాలు
ఉద్యోగం చేసే ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన అప్పాలు
ఆగస్టు 14 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో కీలక మార్పులు..
ఆగస్టు 14 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో కీలక మార్పులు..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..