Pawan Kalyan : భారీ బడ్జెట్‌‌‌తో రానున్న పవన్- క్రిష్ మూవీ… మొగలాయిల కాలం నాటి కథ నేపథ్యంలో సినిమా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్..

Pawan Kalyan : భారీ బడ్జెట్‌‌‌తో రానున్న పవన్- క్రిష్ మూవీ... మొగలాయిల కాలం నాటి కథ నేపథ్యంలో సినిమా..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 31, 2021 | 10:40 AM

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు పవన్. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత రానాతో కలిసి సినిమా చేస్తున్నాడు పవన్. అయితే వీటితోపాటు క్రిష్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమాను కూడా పట్టాలెక్కించాలని చూస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని చూస్తున్నాడట క్రిష్.

ఈ సినిమా కోహినూర్ కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈసినిమా కోసం భారీ సెట్ లు కూడా వేస్తున్నారని తెలుస్తుంది. ముందుగా ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు అనుకున్నారట. కానీ ఇప్పుడు 140 కోట్ల వరకు అవుతుందని టాక్ వినిపిస్తుంది. పవన్ ఇప్పటివరకు భారీ బడ్జెట్ సినిమాల జోలికి పోలేదు. మొదటిసారి పవన్ ఇంత భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కానీ హిట్ అయితే కలక్షన్ల వర్షం కురవడం ఖాయమని అంటున్నారు. సూపర్ హిట్ సొంతం చేసుకుంటే ఈ సినిమా అవలీలగా 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా 2022 సంక్రాంతికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nandita Swetha : ప్రేక్షకులు సినిమాలు చూసే దృష్టి మారాలంటున్న నిఖిల్ హీరోయిన్..