Laila Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన విశ్వక్ సేన్ లైలా మూవీ.. స్రీమింగ్ ఎక్కడంటే..

|

Mar 10, 2025 | 7:08 AM

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల నటించిన లేటేస్ట్ మూవీ లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‏గా నిలిచింది. విశ్వక్ నటనపై ప్రశంసలు వచ్చినప్పటికీ డైరెక్షన్, స్టోరీ పై విమర్శలు వచ్చాయి. థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు వారాలకు ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా. ఇంతకీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా..?

Laila Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన విశ్వక్ సేన్ లైలా మూవీ.. స్రీమింగ్ ఎక్కడంటే..
Vishwak Sen Laila Movie
Follow us on

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటేస్ట్ మూవీ లైలా. డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది. కామెడీ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజే నెగిటివ్ టాక్ సంపాదించుకుంది. రిలీజ్ కంటే ముందే టీజర్, ట్రైలర్ తో మంచి క్యూరియాసిటీని కలిగించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో విశ్వక్ సేన్ అమ్మాయి గెటప్ లో కనిపించారు. అయితే ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. మొత్తానికి ఈ సినిమా రూ.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను షైన్ స్ర్కీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులో మాత్రమే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో విడుదలైన సుమారు మూడు వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతుంది. నిజానికి ఈ సినిమా మార్చి 7న స్ట్రీమింగ్ అవుతుందని రూమర్స్ వినిపించాయి. కానీ అలా కాకుండా రెండు రోజులు ఆలస్యంగా ప్రైమ్ వీడియోలోకి వచ్చింది.

ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ కథానాయికగా నటించింది. ఇందులో అమ్మాయి పాత్రలో కనిపించేందుకు విశ్వక్ సేన్ ఎంతగానో కష్టపడ్డాడు. కానీ అసభ్యత ఎక్కువగా ఉందనే కామెంట్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ హీరో డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో ఓ కామెడీ మూవీ చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..