
ఫ్యామిలీ స్టార్ తర్వాత టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం కింగ్ డమ్. ఆ మధ్యన ఎక్కువగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు చేసిన విజయ్ మళ్లీ కింగ్ డమ్ సినిమాలో ఫుల్ మాస్ రోల్ లో కనిపించాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. అలాగే సత్యదేవ్ మరో కీలక పాత్రలో మెరిశాడు. అభిమానుల భారీ అంచనాల మధ్య జులై 31న రిలీజైన కింగ్ డమ్ సూపర్ హిట్ గా నిలిచింది. మొదటి రోజు నుంచే భారీ వసూళ్లు రాబట్టింది. విజయ్ దేవరకొండ మాస్ అప్పియరెన్స్, సత్యదేవ్ పర్ఫామెన్స్, భాగ్యశ్రీ బోర్సే అందాలు సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఇక అనిరుధ్ అందించిన స్వరాలు, బీజీఎమ్ కూడా ఆడియెన్స్ ను కట్టి పడేశాయి. విజయ్ దేవరకొండ కెరీర్ లో మైల్డ్ స్టోన్ మూవీగా నిలిచిన కింగ్ డమ్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇటీవలే కింగ్ డమ్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 27 నుంచి కింగ్ డమ్ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. అందుకు తగ్గట్టుగానే మంగళవారం అర్ధ రాత్రి నుంచే విజయ్ దేవరకొండ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది.
ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లోనూ కింగ్ డమ్ సినిమా అందుబాటులో ఉంది. శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ కింగ్ డమ్ సినిమాను నిర్మించారు. సత్యదేవ్ తో పాటు మలయాళ నటుడు వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరిశారు అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందించాడు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
🔔 Telugu movie #Kingdom (2025) now streaming on Netflix.
Starring – Vijay Deverakonda, Bhagyashri Borse & Satyadev Kancharana.
Audios – Telugu (Original), Tamil, Malayalam, kannada & Hindi.#KingdomOnNetflix pic.twitter.com/rKOiu8EoaY
— Ott Updates (@Ott_updates) August 27, 2025
Suri has arrived to burn it all down 💪🔥 pic.twitter.com/4JUzF4lqEH
— Netflix India (@NetflixIndia) August 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి